నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్‌ సవాల్

అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడి ఉందని కాంగ్రెస్‌ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కంటెంట్‌ లేని కాంగ్రెస్‌కు కమిట్మెంట్‌ ఉన్న కేసీఆర్‌తో పోలికేంటన్నారు. 

New Update
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్‌ సవాల్

అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడి ఉందని కాంగ్రెస్‌ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కంటెంట్‌ లేని కాంగ్రెస్‌కు కమిట్మెంట్‌ ఉన్న కేసీఆర్‌తో పోలికేంటన్నారు.  కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో తెలంగాణకంటే ముందున్నాయని నిరూపిస్తే తాను రేపు ఉదయం మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌నేతలు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మాట్లాడే ముందు దేని గురించి మాట్లాడుతన్నామో తెలుసుకొని మాట్లాడాలని హితువు పలికారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు తాము ఏదో సాధించినట్లు గొప్పలు చెబుతున్నారన్నారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గాంధీ భవన్‌లో సీట్ల కోసం కొట్టుకోవడం తప్పా.. కేంద్రం నిధులు ఇవ్వకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఆగం చేయాలని చూస్తున్న విషయంపై ఏనాడైనా కేంద్రాన్ని ప్రశ్నించారా ? అని కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు చూసినా కాంగ్రెస్‌ నేతలకు కేసీఆర్‌ను తిట్టిపోసుకోవడమే తప్పా.. రాష్ట్రంలో సీఎం చేసిన అభివృద్ధిని, ప్రభుత్వం అములు చేస్తున్న సంక్షేమ పథకాలను పట్టించుకోలేదన్నారు. మరోవైపు వారానికి ఒక్కసారి ఢిల్లీ వెళ్తున్న బీజేపీ నేతలు అక్కడ పదవుల గురించి చర్చించి వస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అంతే కాకుండా బీజేపీ సభ్యులు సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ పాలనను భరించలేని ప్రజలు కర్నాటకలో ఏ విధంగా సాగనంపారో అందరికీ తెలుసన్నారు. 

మరోవైపు కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం కేసీఆర్‌ను అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. దిశ కేసులో నిందితులను ఎన్‌ కౌంటర్‌ చేసి మహిళలపై మరోసారి అఘాయిత్యానికి దిగకుండా, ఒకవేళ యువతులపై అఘాయిత్యాలకు పాల్పడితే ఏం జరుగుతుందో సీఎం కేసీఆర్‌ చెప్పకనే చెప్పారని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ కేసీఆర్‌కు సెల్యూట్‌ చేశారన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ వరల్డ్‌ సిటీగా ఎదిగిందని చెప్పినట్లు గుర్తు చేశారు. ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 50 ఎకరాలు కొనొచ్చని,  కానీ ప్రస్తుతం తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చని చంద్రబాబు నాయుడు తెలిపారన్నారు. హైదరాబాద్‌ ఆ విధంగా డెవలప్‌ అయిందని చంద్రబాబే చెప్పారన్నారు. పక్క రాష్ట్రాలకు చెందిన నేతలు తెలంగాణలో పాలన గురించి చెబుతున్నారు కానీ.. తెలంగాణకు చెందిన నేతలు మాత్రం దానిని గుర్తించడం లేదని కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు