Breaking : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్‌ బిల్డింగ్‌ పై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

New Update
Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి..

Suicide : ఇడుపులపాయ(Idupulapaya) ట్రిపుల్ ఐటీ(IIIT) లో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ(Surekha) అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్‌ బిల్డింగ్‌ పై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విద్యార్థిని బిల్డింగ్‌ మీద నుంచి దూకడాన్ని గమనించిన హాస్టల్‌ సిబ్బంది ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

కానీ పరిస్థితి విషమయంగా ఉండడంతో ఆమెను కడప రిమ్స్‌(Kadapa RIMS) కు తరలించారు. రిమ్స్‌ లో చికిత్స పొందుతున్న క్రమంలో విద్యార్థిని మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థినిని ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం జంగం గుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థినిగా అధికారులు గుర్తించారు. విద్యార్థిని ఆత్మహత్య(Student Suicide) చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే దాని మీద విచారణ చేపట్టారు.

Also read:ఎన్నికల సమయంలో హాట్‌ టాపిక్‌ గా రేణు దేశాయ్ పోస్ట్‌..దీనికి అర్థం ఏంటి?

Advertisment
తాజా కథనాలు