ICSE, ISC 10, 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో డైరెక్ట్ రిజల్ట్స్! ICSE ISC పది, 12వ తరగతి ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యార్థులు https://results.cisce.org/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. By Nikhil 06 May 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Results : కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ బోర్డు(CISCE) కొద్ది సేపటి క్రితం ICSE ISC పది, 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు https://results.cisce.org/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. ICSE, ISC పరీక్షలు ఫిబ్రవరి 21న ప్రారంభమై.. ఏప్రిల్ 3న ముగిశాయి. రీషెడ్యూల్ చేసిన రెండు పేపర్లను ఏప్రిల్ 4న నిర్వహించారు. ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే.. - విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ www.cisce.org ఓపెన్ చేయాలి. - అనంతరం హోం పేజీలో రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి. - కోర్సు ICSE/ISC సెలక్ట్ చేయాలి. - యూనిక్ ఐడీ, ఇండెక్స్ నంబర్, క్యాప్చా నమోదు చేయాలి. - సబ్మిట్ పై క్లిక్ చేయాలి. - ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. - ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ చేయించుకునే అవకాశాన్ని కల్పించారు. మార్కుల రీకౌంటింగ్ కోసం విద్యార్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. రీవాల్యుయేషన్ కోసం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలు, లింక్స్ ను అధికారిక వెబ్ సైట్లో అతి త్వరలో ఉంచనున్నారు. Also Read : నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్.. 120మందికి మళ్లీ పరీక్ష!? #results #10th-class #12th-class #isc #icse మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి