ICMR Recruitment 2024: సైంటిస్ట్ పోస్టుల కోసం ఐసీఎంఆర్‌ నోటిఫికేషన్‌.. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్‌ ఇదే!

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్-B, సైంటిస్ట్-C పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. మొత్తం 31 ఖాళీలున్నాయి. ఫిబ్రవరి 16న అప్లై చేయడానికి లాస్ట్ డేట్. https://recruit.icmr.org.in/ ని విజిట్ చేసి ఆన్‌లైన్‌ మోడ్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

New Update
ICMR Recruitment 2024: సైంటిస్ట్ పోస్టుల కోసం ఐసీఎంఆర్‌ నోటిఫికేషన్‌.. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్‌ ఇదే!

ICMR Scientist Jobs: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సైంటిస్ట్-బీ, సైంటిస్ట్-సీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ recruitment.icmr.org.in ని విజిట్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో సైంటిస్ట్-బీ, సైంటిస్ట్-సీ కింద 31 పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 31 ఖాళీలలో సైంటిస్ట్-బీ పోస్టుకు 30 ఖాళీలు ఉన్నాయి. అందులో 15 మెడికల్, 15 నాన్-మెడికల్ ఉన్నాయి. సైంటిస్ట్-సీ(బయోఎథిక్స్)కు సింగిల్ వెకెన్సీ ఉంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ.. దరఖాస్తు రుసుము:
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (MCQ) లేదా ఇంటర్వ్యూ లేదా రెండింటి ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష కనీస అర్హత మార్కులు 75 శాతంగా ఉంటాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీజుగా రూ. 1,500 చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/మహిళలు/PWBD/EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
--> అధికారిక వెబ్‌సైట్ https://recruit.icmr.org.in/ ని సందర్శించండి.
--> హోమ్‌పేజీలో అప్లై లింక్‌పై క్లిక్ చేయండి.
--> దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
--> అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
--> దరఖాస్తు రుసుము చెల్లించండి.
--> ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ తీసుకోండి.

Also Read: ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు