Ice Facial: ఈ ఐస్‌ ఫేషియల్‌ను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. ఎన్ని లాభాలో తెలుసా?

సమ్మర్​లో వివిధ కారణాలతో కళ్లు ఉబ్బడం, మొటిమలు రావడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రశాంతంగా ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. ఎండలో బయటకు వెళ్లడం కష్టమనుకునేవారు ఇంట్లోనే ఐస్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.

Ice Facial: ఈ ఐస్‌ ఫేషియల్‌ను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. ఎన్ని లాభాలో తెలుసా?
New Update

Ice Facial: సమ్మర్​లో స్కిన్​ కేర్ తీసుకోవడం చాలా అవసరం. అయితే ఎండలో బయటకు వెళ్లడం కష్టమనుకునేవారు.. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిలో ఐస్ ఫేషియల్ ఒకటి. ఇది చర్మ సంరక్షణలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫేషియల్​ను ఎలా చేయాలి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వంటి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వివిధ కారణాలతో కళ్లు ఉబ్బడం, మొటిమలు రావడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రశాంతంగా ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. సహజంగా చర్మాన్ని హెల్తీగా ఉంచడంలో సహాయం చేస్తుంది. చర్మ సమస్యలకు చెక్ పెట్టుకోవడానికి ఐస్ ఫేషియల్ హెల్ప్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

క్రయోథెర:

ఐస్ ఫేషియల్​ను క్రయోథెరపీగా చెప్తారు. ఐస్​ లేదా కోల్డ్ క్రంపెస్​లను ఉపయోగించి.. మొహంపై ముఖానికి అప్లై చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్​ని మృదువైన క్లాత్​లో వేసుకుని.. ముఖంపై మాసాజ్ చేసుకోవాలి. లేదా కోల్డ్ ఫేషియల్ రోల్స్ ఉపయోగించి ఈ ఫేషియల్​ను చేసుకోవచ్చు. ఇది మీకు మంచి ప్రయోజనాలు ఇవ్వడమే కాకుండా వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది.

బెనిఫిట్స్:

చల్లిని ఉష్ణోగ్రత వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచం చెందుతాయి. అనంతరం విస్తరిస్తాయి. ఆ ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల స్కిన్ టోన్​ కూడా మెరుగవుతుంది. కళ్లు ఉబ్బడం, కంటి కింద ఉండే నల్ల వలయాలు తగ్గుతాయి. ఈ ఐస్ ఫేషియల్​ను ఉదయాన్నే చేసుకుంటే చర్మం చాలా హెల్తీగా ఉంటుంది. పైగా ఉదయం దీనిని చేయడం వల్ల నిద్ర మత్తు నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా చర్మం తాజాగా ఉంటుంది.

మొటిమల సమస్యలకు మంచి ఫలితాలు:

మొటిమలతో ఇబ్బంది పడేవారు కచ్చితంగా దీనిని ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు. మొటిమల వల్ల కలిగే వాపుని, రెడ్​నెస్​ను, నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. దీనివల్ల మొటిమలు చాలా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా చర్మంలో ఆయిల్​ విడుదలల కావడం తగ్గుతుంది. అలాగే ఓపెన్ పోర్స్​నుంచి కూడా ఉపశమనం అందుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఐస్ ఫేషియల్ చేసుకోవాలనుకుంటే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖంపై డర్ట్ లేదా మేకప్​ ఉంటే క్లీన్ చేసుకోవాలి. అనంతరం ఐస్​ను డైరక్ట్​గా ఫేస్​పై పెట్టుకుండా.. సాఫ్ట్ టిష్యూ లేదా.. కాటన్ క్లాత్​లో వేసి ముఖంపై మసాజ్ చేయాలి. లేదంటే కోల్ట్ ఫేషియల్ రోలర్​ని ఉపయోగించవచ్చు. వీటిని సర్కిల్​లో మెల్లగా కదిలిస్తూ మసాజ్ చేయాలి. కంటి కింద, మొటమలు ఉన్న ప్రాంతాలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. అయితే ప్రతి సెషన్​ను ఒకటి నుంచి రెండు నిమిషాలు మాత్రమే చేయాలి. లేదంటే స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశముంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: టైప్-2 డయాబెటిస్‌కు అతి పెద్ద శత్రువులు ఈ ఆహారాలు.. షాకింగ్ నిజాలు!

#ice-facial
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe