Type-2 Diabetes: టైప్-2 డయాబెటిస్‌కు అతి పెద్ద శత్రువులు ఈ ఆహారాలు.. షాకింగ్ నిజాలు! బిస్కెట్లు, సలాడ్స్ వంటి వాటి ద్వారా ఎమల్సిఫైయర్లు శరీరంలోకి వెళ్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. తాజాగా జరిపిన అధ్యయనం ఈ ఎమల్సిఫైయర్లు టైప్ 2 డయాబెటిస్‌ను ప్రమోట్ చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 17 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Type-2 Diabetes: కొన్నిరకాల ఫుడ్స్‌ని చిక్కగా, సంరక్షించడానికి, ఆకృతిని మెరుగుపరి చేందుకు ఉపయోగించే ఆహార పదర్థాన్నే ఎమల్సిఫైయర్లు అంటారు. ఇవి డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని తాజాగా నిర్వహించిన అధ్యయనం తెలిపింది. అయితే ఇది చాలా ఫేమస్ అయిన ఆహారాలలో ఉంటాయని షాకింగ్ విషయాలు తెలిపింది. అంతేకాకుండా.. FDA వీటిని సురక్షితమైనవిగానే గుర్తించింది. కానీ తాజాగా జరిపిన అధ్యయనం ఈ ఎమల్సిఫైయర్లు టైప్ 2 డయాబెటిస్‌ను ప్రమోట్ చేస్తున్నాయని షాకింగ్ విషయం తెలిపింది. డీకోడ్ చేసిన అధ్యయనం: రక్తంలో చక్కెర స్థాయిలు నిశ్శబ్ధంగా ఎలా పెరుగుతున్నాయో ఈ అధ్యయనంలో తెలింది. బిస్కెట్లు, సలాడ్స్ వంటి వాటి ద్వారా ఎమల్సిఫైయర్లు శరీరంలోకి వెళ్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇన్సులిన్ నిరోధకతపై ఎమల్సిఫైయర్లు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయని ఈ అధ్యయనంలో డీకోడ్ చేశారు. దీనిగురించి.. ది లాన్సెట్‌లో ప్రచురించారు. ఎమల్సిఫైయర్లు వల్ల టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చేస్తుందని గుర్తించింది. రెగ్యూలర్‌గా వినియోగించే.. ప్రాసెస్ చేసిన ఏడు ఆహారాలలో ఎమల్సిఫైయర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇన్సులిన్‌పై ప్రతికూల ప్రభావం: మయోనైస్, సలాడ్ డ్రెస్సింగ్, కుకీలు, బ్రెడ్స్, ఐస్‌క్రీమ్‌లు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ఫుడ్స్ లేబుల్‌పై ఓ కన్ను వేయాలని చెప్తున్నారు. ఎమల్సిఫైయర్లు.. చమురు, నీరు వంటి రెండు వేర్వేరు పదార్థాలను కలిపి చేసే బైండింగ్ ఏజెంట్లుగా చెప్తున్నారు. ఇవి టైప్ 2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. ఉప్పు, మోనో డైగ్లిజరైడ్స్, ఫ్యాట్స్, సోడియం సిట్రేట్, క్యారేజీనన్స్ లేదా సముద్రపు పాచి, గ్వార్గమ్, శాంతన్గమ్.. ఈ పదార్థాలు ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి. గట్ బ్యాక్టీరియా, జీవక్రియ పనితీరులో జోక్యం చేసుకుని.. మధుమేహ ప్రమాద కారకాలను 15 శాతం వరకు పెంచుతాయని అధ్యయనం తెలిపింది. ఆ కెమికల్స్‌తో జాగ్రత్త: ఐస్ క్రీమ్, బట్టర్, మయోన్నైస్ వరకు రోజువారీ ఆహారాల్లో ఎమల్సిఫైయర్లు చూడవచ్చు. ఇవి అంతర్లీనంగా చెడు చేయవు. కానీ.. ఎమల్సిఫైయర్లు పండ్లలోని పెక్టిన్ వలె సహజంగా కూడా సంభవిస్తాయి. అయితే కొన్ని పరిశోధనలు ఆహార సంకలిత ఎమల్సిఫైయర్లు కొన్ని వ్యాధులపై తీవ్ర ప్రభావాలు ఇస్తాయి. క్యారేజీనాన్స్, క్యారేజీనన్ గమ్, ట్రిపోటాషియం ఫాస్పేట్, మోనోగ్లిజరైడ్స్, డైగ్లిజరైడ్స్, గమ్ అరబిక్, క్షాంతన్ గమ్.. ఈ ఏడురకాల ఎమల్సిఫైయర్స్ టైప్ 2 డయాబెటిస్‌కు ప్రధాన కారణమవుతున్నాయి. ఎమల్సిఫైయర్స్ అంటే ఏమిటి: ఎమల్సిఫైయర్లు కెమికల్స్ ఇవి సాధారణంగా ఆహార పదార్థాల్లో ఉంటాయి కానీ.. వాటిలో కలిసిపోవు. నీళ్లలో నూనె కలుస్తుందా..? లేదు కదా.. అలానే ఎమల్సిఫైయర్లు కూడా ఫుడ్‌లో కలిసిపోవు. కానీ ఇవి మిశ్రమంగా మార్చడానికి సహాయపడతాయి. కొన్ని ఆహార పదార్థాలను ఎక్స్‌పెయిరీ డేట్ వరకు చిక్కగా, కరిగిపోకుండా ఉండేందుకు దీనిని ఉపయోగిస్తారు. నీరు, కొవ్వు పదార్థాలను ఒకదానితో ఒకటి బాగా మిక్స్ చేస్తారు. ఐస్‌క్రీమ్‌ను కూడా ఇలానే తయారు చేస్తారు. అందుకే అది కరిగిపోకుండా ఉంటుంది. వాటికి దూరంగా ఉంటే మంచిది: ఎమల్సిఫైయర్లు టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో ఎమల్సిఫైయర్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అధ్యయనం కోసం లక్షమందిని పైగా స్టడీ చేశారు. పరిశోధకులు ప్రతి ఆరు నెలలకు ఈ స్టడీలో పాల్గొనేవారి ఆహారపు అలవాట్లు, ఎమల్సిఫైయర్ ఎక్స్పోజర్ను ల్యాబ్ పరీక్షల ద్వారా ట్రాక్ చేశారు. ఈ ఫాలో అప్ తర్వాత.. టైప్ 2 డయాబెస్తో బాధపడుతున్నవారిని, వారి డేటాను గమనించి.. నిర్దిష్టమైన ఎమల్సిఫైయర్లు తీసుకోవడం వల్లనే టైప్ 2 మధుమేహం వచ్చినట్లు గుర్తించారు. ఈ ఎమల్సిఫైయర్లు గట్‌లోని రక్షిత శ్లేష్మ పొరను దెబ్బతీస్తాయి. గట్ ప్రమాదాన్ని పెంచుతాయని మునుపటి పరిశోధనలు కూడా తెలిపాయి. దీనివల్ల కడుపులో మంట సమస్య ఎక్కువ అవుతుంది. పోషకాలను, జీవక్రియలను ఉత్పత్తి చేసే గట్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది శరీరంపై ప్రభావం చూపి.. ఇన్సులిన్ సున్నితత్వాన్ని, గ్లూకోజ్‌ను జీవక్రియ చేసే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపి మధుమేహానికి దారి తీస్తుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ఆ సామర్థ్యం పెరగాలంటే.. ఈ ఫుడ్స్ తీసుకోండి! #type-2-diabetes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి