Ice Facial: ఈ ఐస్ ఫేషియల్‌ను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. ఎన్ని లాభాలో తెలుసా? సమ్మర్లో వివిధ కారణాలతో కళ్లు ఉబ్బడం, మొటిమలు రావడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రశాంతంగా ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. ఎండలో బయటకు వెళ్లడం కష్టమనుకునేవారు ఇంట్లోనే ఐస్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Ice Facial: సమ్మర్లో స్కిన్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. అయితే ఎండలో బయటకు వెళ్లడం కష్టమనుకునేవారు.. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిలో ఐస్ ఫేషియల్ ఒకటి. ఇది చర్మ సంరక్షణలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫేషియల్‌ను ఎలా చేయాలి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వంటి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. వివిధ కారణాలతో కళ్లు ఉబ్బడం, మొటిమలు రావడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రశాంతంగా ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. సహజంగా చర్మాన్ని హెల్తీగా ఉంచడంలో సహాయం చేస్తుంది. చర్మ సమస్యలకు చెక్ పెట్టుకోవడానికి ఐస్ ఫేషియల్ హెల్ప్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. క్రయోథెర: ఐస్ ఫేషియల్‌ను క్రయోథెరపీగా చెప్తారు. ఐస్ లేదా కోల్డ్ క్రంపెస్లను ఉపయోగించి.. మొహంపై ముఖానికి అప్లై చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్‌ని మృదువైన క్లాత్‌లో వేసుకుని.. ముఖంపై మాసాజ్ చేసుకోవాలి. లేదా కోల్డ్ ఫేషియల్ రోల్స్ ఉపయోగించి ఈ ఫేషియల్‌ను చేసుకోవచ్చు. ఇది మీకు మంచి ప్రయోజనాలు ఇవ్వడమే కాకుండా వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. బెనిఫిట్స్: చల్లిని ఉష్ణోగ్రత వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచం చెందుతాయి. అనంతరం విస్తరిస్తాయి. ఆ ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల స్కిన్ టోన్ కూడా మెరుగవుతుంది. కళ్లు ఉబ్బడం, కంటి కింద ఉండే నల్ల వలయాలు తగ్గుతాయి. ఈ ఐస్ ఫేషియల్‌ను ఉదయాన్నే చేసుకుంటే చర్మం చాలా హెల్తీగా ఉంటుంది. పైగా ఉదయం దీనిని చేయడం వల్ల నిద్ర మత్తు నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా చర్మం తాజాగా ఉంటుంది. మొటిమల సమస్యలకు మంచి ఫలితాలు: మొటిమలతో ఇబ్బంది పడేవారు కచ్చితంగా దీనిని ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు. మొటిమల వల్ల కలిగే వాపుని, రెడ్‌నెస్‌ను, నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. దీనివల్ల మొటిమలు చాలా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా చర్మంలో ఆయిల్ విడుదలల కావడం తగ్గుతుంది. అలాగే ఓపెన్ పోర్స్నుంచి కూడా ఉపశమనం అందుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఐస్ ఫేషియల్ చేసుకోవాలనుకుంటే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖంపై డర్ట్ లేదా మేకప్ ఉంటే క్లీన్ చేసుకోవాలి. అనంతరం ఐస్‌ను డైరక్ట్‌గా ఫేస్‌పై పెట్టుకుండా.. సాఫ్ట్ టిష్యూ లేదా.. కాటన్ క్లాత్‌లో వేసి ముఖంపై మసాజ్ చేయాలి. లేదంటే కోల్ట్ ఫేషియల్ రోలర్ని ఉపయోగించవచ్చు. వీటిని సర్కిల్లో మెల్లగా కదిలిస్తూ మసాజ్ చేయాలి. కంటి కింద, మొటమలు ఉన్న ప్రాంతాలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. అయితే ప్రతి సెషన్‌ను ఒకటి నుంచి రెండు నిమిషాలు మాత్రమే చేయాలి. లేదంటే స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశముంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: టైప్-2 డయాబెటిస్‌కు అతి పెద్ద శత్రువులు ఈ ఆహారాలు.. షాకింగ్ నిజాలు! #ice-facial మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి