గతంలో క్రికెట్(Cricket) అంటే ప్లేయర్ల గురించి... వారి బలాలు, బలహీనతల గురించి ఎక్కువగా చర్చ జరిగేది. పిచ్(Pitch)ల గురించి కూడా మాట్లాడుకునేవారు కానీ ఎక్కువగా దాని గురించి డిస్కషన్ జరిగి ఉండే రోజులు కావి అవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏ దేశంలో మ్యాచ్ జరిగితే ఆ దేశ ప్లేయర్ల కోసం పిచ్‌లు తయారు అవుతున్నాయి. హోం అడ్వాంటేజ్ అంటూ గెలుపు కోసం పిచ్‌లు తయారు చేస్తున్నారు. అందుకే ఐదు రోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిసిపోతున్నాయి. ఇండియాలో మ్యాచ్ జరిగితే స్పిన్‌కి అనుకూలంగా, ఆస్ట్రేలియాలో జరిగితే పేస్‌కు అనుకూలంగా పిచ్‌లు ఉంటున్నాయి. స్పోరిటివ్ పిచ్‌లు చూసి ఏళ్లు దాటింది. అయితే బై-లెటరెల్ మ్యాచ్‌లకు ఇలా తయారు చేసుకుంటే సరేలే అనుకోవచ్చు. ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్(World Cup)లోనూ పిచ్‌ల తయారీ ఏ మాత్రం బాలేదని సాక్ష్యాత్తు ఇంటర్‌నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)నే చెప్పడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
11 మ్యాచ్‌లు- ఐదు నాసిరకం పిచ్‌లు:
సాధారణంగానే పిచ్‌లపై ఐసీసీ రేటింగ్ ఇస్తుంటుంది. వరల్డ్‌కప్ మ్యాచ్‌లపైనే తాజాగా రేటింగ్ ఇచ్చింది. మొత్తం 11 మ్యాచ్‌లు 'యావరేజ్' పిచ్‌లపై జరిగాయని చెప్పింది. ఇందులో ఐదు ఇండియా ఆడినవే ఉన్నాయి. వరల్డ్‌కప్ ఫైనల్, సెమీస్ మ్యాచ్‌లు కూడా 'యావరేజ్' పిచ్‌లపైనే జరిగాయి. ఫైనల్‌లో ఇండియా ఆస్ట్రేలియాపై అహ్మదాబాద్‌లో ఆడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో లక్నోలో, అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో, కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో, చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో ట్రాక్‌లను యావరేజ్‌గా రేట్ చేసింది ఐసీసీ.
అహ్మదాబాద్‌లోనే రెండు మ్యాచ్‌లు
ఇండియా ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఐదు 'యావరేజ్' పిచ్‌లను ఐసీసీ రేట్ చేయగా.. అందులో రెండు అహ్మదాబాద్‌లో ఆడినవే ఉన్నాయి. క్రికెట్ పరంగా ప్రపంచంలోనే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం ఇది. అలాంటిది పిచ్ విషయంలో పొరపాట్లు జరగడంపై అభిమానులు అప్‌సెట్ అయ్యారు. ఈ ఏడాది(2023) జరిగిన ఐపీఎల్‌లోనూ అహ్మదాబాద్ స్టేడియం నిర్వాహణపై విమర్శలు వచ్చాయి. వర్షం పడితే డస్టర్లతో పిచ్‌లను డ్రై చేశారు సిబ్బంది. ఇలా పేరు గొప్ప ఊరు దిబ్బగా ఈ గ్రౌండ్‌ను తయారు చేస్తున్నారని బీసీసీఐపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Also Read: అభిమానులకు షాకింగ్ న్యూస్..విరాట్ కోహ్లీ లేకుండానే టీ20 ప్రపంచకప్..!!
WATCH: