IND vs PAK: కోహ్లీ చేసిన ఈ పని పాకిస్థాన్‌ ప్రజల హృదయాలను హత్తుకుంది.. వైరల్‌ వీడియో..!

భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు ముగిసిన తర్వాత బాబర్ అజామ్‌కు విరాట్ కోహ్లీ సంతకం చేసిన జెర్సీను ఇచ్చాడు. తన అంకూల్‌ కొడుకు కోహ్లీ టీషర్ట్ కావాలని అడిగాడని బాబర్‌ చెప్పాడు. దీంతో కోహ్లీ వెంటనే తన టీషర్ట్‌ను బాబర్‌కు ఇచ్చేశాడు. సమకాలీన క్రికెటర్లు ఈ ఇద్దరి మధ్య గట్టి పోటి ఉండగా.. బాబర్‌ అందరి ముందు కోహ్లీ దగ్గర టీషర్ట్‌ తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కోహ్లీ చేసిన పని పాక్‌ అభిమానులకు ఎంతగానో నచ్చిందట!

IND vs PAK: కోహ్లీ చేసిన ఈ పని పాకిస్థాన్‌ ప్రజల హృదయాలను హత్తుకుంది.. వైరల్‌ వీడియో..!
New Update

కోహ్లీ(Virat Kohli) అంటే కింగ్ ఆఫ్‌ క్రికెట్ మాత్రమే కాదు.. కింగ్‌ ఆఫ్‌ హార్ట్స్‌ కూడా. తన ఆటతో యావత్‌ క్రికెట్ ప్రపంచం మనసులను గెలుచుకున్న ఈ జనరేషన్‌ లెజెండ్ కోహ్లీ. అయితే కేవలం కోహ్లీ ఆటనే కాదు.. అతని మనసు కూడా చాలా గొప్పది. ఎన్నో సేవ కార్యక్రమాల్లో పాల్గొనే కోహ్లీ బయట ఎప్పుడూ ఆ విషయాలు చెప్పుకోడు. ఇక అభిమానులను కూడా ఎప్పుడూ బాధపెట్టడు. తన కోసం ఏ అభిమాని అయినా దూరం నుంచి చూస్తు నిలపడి ఉంటే అతడిని పిలిచి మరి సెల్ఫీ దిగే మంచి తత్వం కోహ్లీది. అటు ప్రత్యర్థి ఆటగాళ్ల విషయంలోనూ కోహ్లీ రూటు సపరేటు. తనకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాడు. నచ్చకపోతే కయ్యానికి దిగుతాడు. ఇక సమకాలీన క్రికెట్‌లో కోహ్లీకి పోటి ఉన్న బ్యాటర్లలో పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజమ్‌(Babar Azam) ఒకడు. నిన్న ఇండియా-పాకిస్థాన్‌ మధ్య వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లీ చేసిన ఓ పని అందరిని కట్టిపడేసింది.


ఎవరేం అనుకున్నా..:
ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్ ఆడుతున్నాయంటే అదోక యుద్ధంలాగా భావించే ప్రజలు ఉంటారు. అయితే ఇటివలి కాలంలో ఇరు దేశాల క్రికెటర్లు చాలా స్నేహభావంతో ఉంటున్నారు. దీన్ని ఇండియా వైపు నుంచే కాకుండా పాకిస్థాన్‌ నుంచి కూడా కొందరు మాజీ క్రికెటర్లు వ్యతిరేకించారు. ఒక లిమిట్‌ వరకు ఉండొచ్చు కానీ ఇరు దేశాల క్రికెటర్లు కాస్త ఓవర్‌ చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కోహ్లీతో పాక్‌ క్రికెటర్ల సాన్నిహిత్యం గురించి గంభీర్‌ లాంటి మాజీ ఆటగాళ్లు ఓపెన్‌గానే విమర్శలు గుప్పించారు. అయితే వీటిని కోహ్లీ ఏ మాత్రం పట్టించుకోలేదు. పాక్‌తో మ్యాచ్‌ సమయంలో ఎంత కసిగా కనిపించాడో మ్యాచ్‌ ముగిసిన తర్వాత వారిని తోటి క్రికెటర్ల లాగానే చూశాడు.


బాబర్‌ అజామ్‌:
మ్యాచ్‌ ముగిసిన తర్వాత పాక్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ కోహ్లీ వద్దకు వచ్చాడు. తన చుట్టాల్లో ఒక చిన్నపిల్లవాడు మీ టీ షర్ట్‌ అడిగాడని కోహ్లీకి చెప్పాడు. కోహ్లీ వెంటనే తన టీ షర్ట్‌ని ఆటోగ్రాఫ్ చేసి బాబర్‌కి వచ్చేశాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చాలా మంది క్రీడాస్ఫూర్తిగా అభివర్ణిస్తుండగా మరికొందరు మాత్రం తిడుతున్నారు. నిజానికి తనతో పోటి పడుతున్న క్రికెటర్ దగ్గరకు వెళ్లి అందరి ముందు టీ షర్ట్ అడగడం బాబర్‌ క్రీడాస్ఫూర్తిగా చెప్పవచ్చు. అయితే నిన్న పాక్‌ మ్యాచ్‌ ఓడిపోయింది. ఆ సమయంలో ఈ పని చేసి ఉండాల్సింది కాదని పాక్‌ మాజీలు అభిప్రాయపడుతున్నారు. పాక్ లెజండరీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ కూడా ఇదే అన్నాడు.

ALSO READ: ఇద్దరూ ఇద్దరే.. రోహిత్, కోహ్లీకి ఉన్న ఈ రికార్డులు చూస్తే మతిపోవాల్సిందే..!

#virat-kohli #india-vs-pakistan #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe