/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pak-bowlers-jpg.webp)
ICC World Cup 2023:ఒకప్పుడు పాకిస్థాన్ బౌలింగ్ లైనప్‌ను చూసి ప్రత్యర్థులు భయపడిపోయేవారు. హెల్మెట్ సరిగ్గా పెట్టుకోకపోతే తల పగులుతుందేమోనన్న టెన్షన్‌తో క్రీజులోకి వచ్చేవారు. రన్స్ చేయడం సంగతి పక్కన పెడితే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగకూడదని ఆలోచించేవారు. వాళ్ల పేస్ బౌలింగ్ అలా ఉంటుంది మరి. పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ తన బౌలింగ్‌లో 17మందిని రిటైర్డ్ హర్ట్ చేశాడు. వసీం అక్రమ్, వకార్ యూనిస్ ప్రపంచం గర్వించదగ్గ బౌలర్లు. గంటకు 150కు పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉన్న ఆనాటి పాక్ బౌలర్లు ఎక్కడా.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్న ప్రస్తుత పాక్ బౌలర్లు ఎక్కడ..! పాకిస్థాన్ అభిమానులు ఇదే విషయాన్ని తలచుకుంటూ తెగ ఫీల్ అవుతున్నారు. వాళ్లు అంతలా బాధ పడేలా చేశాడు హరీస్ రవూఫ్(Haris Rauf).
Haris Rauf has conceded 500 runs in this World Cup now. pic.twitter.com/DfA4c8wB7I
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2023
అతి చెత్త రికార్డు:
రవుఫ్ ఈ వరల్డ్‌కప్ సీజన్‌లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. పాకిస్థాన్ ప్రధాన బౌలర్లలో ఒకడైన రవుఫ్ అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. 9 మ్యాచ్‌ల్లో 533 పరుగులు సమర్పించుకున్నాడు. 48ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఆదిల్ రషీద్ మినహా ఏ బౌలర్ కూడా ఓ సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఇన్ని పరుగులు సమర్పించుకోలేదు. 600కు పైగా రన్స్‌తో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్ల లిస్ట్ పరీశిలిస్తే:
ఆదిల్ రషీద్(ఇంగ్లండ్) - 11 మ్యాచ్‌లలో 626 పరుగులు- 2019 వరల్డ్‌కప్‌లో 11 వికెట్ల
హరీస్ రవూఫ్(పాకిస్థాన్) - 9 మ్యాచ్‌ల్లో 533 పరుగులు - 2023వరల్డ్‌కప్‌లో 16 వికెట్లు
దిల్షాన్ మధుశంక(శ్రీలంక) - 9 మ్యాచ్‌ల్లో 525 రన్స్ - 2023వరల్డ్‌కప్‌లో 21 వికెట్లు
మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) - 10 మ్యాచ్‌ల్లో 502 - 2019వరల్డ్‌కప్‌లో 10 వికెట్లు
నిజానికి హరీస్ రవుఫ్ 16వికెట్లతో ఫర్వాలేదనిపించినా.. రన్స్ మాత్రం భారీగా సమర్పించుకోవడం పాక్ అభిమానుల కోపానికి కారణం అయ్యింది. ఇదే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ తరఫున 18 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచిన షాహీన్ షా ఆఫ్రిది కూడా 18 మ్యాచ్‌ల్లో 481 పరుగులు సమర్పించుకున్నాడు.
Also Read: దీపావళి రోజు పేలిన టీమిండియా టపాసులు.. మరిచిపోలేని జ్ఞాపకాలు..!
WATCH: