IND vs ENG: 'ఆరే'శారు.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను ఇంటికి తరిమేసిన రోహిత్, షమి!

టీమిండియా అదరగొట్టింది. డబుల్ హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షమి 4 వికెట్లతో దుమ్మురేపాడు.

IND vs ENG: 'ఆరే'శారు.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను ఇంటికి తరిమేసిన రోహిత్, షమి!
New Update

టీమిండియా ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. ఇప్పటివరుకు ఆరు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు, మరోవైపు టోర్నిలో ఐదు మ్యాచ్‌లు ఓడిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ చిత్తుగా ఆడడంతో దాదాపు సెమీస్‌ అవకాశాలను పొగొట్టుకుంది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై 100 బంతుల్లో 87 పరుగులు చేసిన రోహిత్‌కి ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. అటు భారత్‌ బౌలర్లో షమీ మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏడు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు


ఇంగ్లండ్‌.. బై.. బై:
230పరుగుల టార్గెట్‌ ఛేజ్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఏ దశలోనూ విజయంవైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో మొదలైన వికెట్ల పరంపర.. చివరి వికెట్ వరకు కొనసాగింది. 17 బంతుల్లో 16 రన్స్ చేసి మలాన్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రూట్‌ డకౌట్‌గా వెనుతిరిగాడు. బుమ్రా బౌలింగ్‌లో రూట్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో 23 బంతుల్లో 14 రన్స్ చేసి షమీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. ఇక బెన్‌స్టోక్స్‌ ఇలా వచ్చి అలా వెళ్లాడు. పది బాల్స్‌ తిని.. ఒక్క పరుగు కూడ చేయకుండా షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అటు ఆదుకుంటాడనుకున్న కెప్టెన్‌ బట్లర్‌ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 23 బంతుల్లో 10 పరుగులే చేసిన బట్లర్‌ను కులదీప్‌ యాదవ్‌ బౌల్డ్ చేశాడు. దీన్నే బాల్‌ ఆఫ్ ది వరల్డ్‌కప్‌గా ఫ్యాన్స్‌ కీర్తిస్తున్నారు.

ఇక ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఆట తీరు మారలేదు.. ఎందుకు బ్యాటింగ్‌ వస్తున్నారో.. ఎందుకు ఔట్ అవుతున్నారో అర్థంకాని దుస్థితి. మరోవైపు షమీ బంతితో నిప్పులు కక్కాడు. దీంతో ఇంగ్లండ్‌ 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇది రెండోసారి. 1987 ప్రపంచ కప్‌ గెలుచుకున్న ఆస్ట్రేలియా 1992 వరల్డ్‌కప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోగా.. 2019 ప్రపంచకప్‌ గెలుచుకున్న ఇంగ్లండ్‌ ఈ వరల్డ్‌కప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది.

Also Read: బాల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌కప్‌.. ఏమన్నా వేశాడా భయ్యా..!

#rohit-sharma #cricket #mohammed-shami #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe