Virat Kohli: కోహ్లీ ఏం చేస్తాడో..? ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న కోహ్లీ సెమీస్‌ గణాంకాలు..!

2011,2015, 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లలో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. ఈ మూడు సెమీస్‌లు కలిపి కోహ్లీ చేసింది 11 పరుగులే. దీంతో ఈ సెమీస్‌లో కోహ్లీ ఎలా ఆడుతాడోనన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది.

New Update
Virat Kohli: కోహ్లీ ఏం చేస్తాడో..? ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న కోహ్లీ సెమీస్‌ గణాంకాలు..!

ICC WORLD CUP 2023 India vs Newzealand semis: ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియా నుంచి కోహ్లీనే టాప్‌ రన్‌ గెటర్‌. మరో 80 రన్స్ చేస్తే వరల్డ్‌కప్‌ హిస్టరీలో సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. 2003 ఎడిషన్‌లో సచిన్ 673 రన్స్ చేశాడు. ఇక రేపు(నవంబర్‌ 15) ముంబై వేదికగా టీమిండియా, భారత్‌ మధ్య ఫైట్ జరగనుంది. వరల్డ్‌కప్‌లో జరగనున్న ఈ తొలి సెమీస్‌ మ్యాచ్‌కు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్‌లో అందరిచూపు కోహ్లీపై పడింది. మరో సెంచరీ చేస్తే వన్డేల్లో 50 శతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. కానీ సెమీస్‌కు ముందు కోహ్లీకి ఉన్న ఓ చెత్త రికార్డు ఫ్యాన్స్‌ను కలవర పెడుతోంది.


సెమీస్‌లో దారుణ రికార్డులు:
ఇప్పటివరకు కోహ్లీ మూడు సార్లు వరల్డ్‌కప్‌ సెమీస్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. కనీసం సింగిల్‌ డిజిట్‌ మార్క్‌ కూడా దాటలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 11 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు 9. 2011 ప్రపంచకప్‌ సెమీస్‌లో పాకిస్థాన్‌పై 9 రన్స్ చేశాడు కోహ్లీ. వహబ్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 2015 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై సెమీస్‌లో కేవలం ఒక్క పరుగుకే వెనుతిరిగాడు కోహ్లీ. జాన్సన్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 2019 ప్రపంచకప్‌ సెమీస్‌ కూడా ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో బౌల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇలా మూడు సార్లు కూడా లెఫ్ట్ ఆర్మ్‌ పేసర్లకే కోహ్లీ వికెట్ సమర్పించుకున్నాడు.


ఈసారి అలా జరగదు:
నిజానికి తన కెరీర్‌లో కోహ్లీ ఫామ్‌ కోల్పోయిన సందర్భాలు చాలా తక్కువ. టెస్టుల్లో కాస్త డీలా పడ్డాడు కానీ.. వన్డేల్లో కోహ్లీ ఎప్పుడూ కింగే. అయితే సెమీస్‌లో మూడుసార్లు ఫెయిల్‌ కోహ్లీ అవ్వడం ఫ్యాన్స్‌ను ఆందోళన పెట్టే అంశం. ఈ వరల్డ్‌కప్‌లో మాత్రం కోహ్లీ సెమీస్‌లో రాణిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత కోహ్లీ భీకరంగా ఉంది. కివీస్‌పై మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తాడని అంచనాలు కూడా ఉన్నాయి. మ్యాచ్‌ జరగనున్న వాంఖడే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే అంతకంటే గొప్ప ఆనందం ఇండియన్స్‌కు మరొకటి ఉండదు.

Also Read: ‘ధోనీని చూసి నేర్చుకోండి’.. రమీజ్ రాజాకు గడ్డిపెట్టిన పాక్ మాజీ పేసర్

WATCH:

Advertisment
తాజా కథనాలు