IND vs NZ: 'ఫ్రెండ్‌షిప్‌ కోటాలో అతడిని ఆడిస్తున్నారా'? 'రోహిత్‌.. ఏంటిది?'

సూర్యకుమార్‌ యాదవ్‌ని తుది జట్టులోకి ఎంపిక చేయడం పట్ల పలువురు ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై పోరులో గాయపడ్డ పాండ్యా స్థానంలో సూర్యను తీసుకుంది టీమిండియా. అయితే వన్డేల్లో సూర్య గణాంకాలు తీసికట్టుగా ఉన్నాయని.. అలాంటిది కీలక మ్యాచ్‌కు అతడిని ఎలా ఎంపిక చేశారని మండిపడుతున్నారు.

IND vs NZ: 'ఫ్రెండ్‌షిప్‌ కోటాలో అతడిని ఆడిస్తున్నారా'? 'రోహిత్‌.. ఏంటిది?'
New Update

భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో తుది జట్టు ఎంపికపై పలువురు అభిమానులు పెదవి విరుస్తున్నారు. కెప్టెన్‌ రోహిత్ శర్మ(Rohit Sharma) బయాసెడ్‌గా టీమ్‌ని సెలక్ట్ చేశాడని ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్‌షిప్‌లు పక్కన పెట్టి ప్లేయంగ్‌-11ని సెలక్ట్ చేయాలని కౌంటర్లు వేస్తున్నారు. వరల్డ్‌కప్‌పై పోరులో బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ పాండ్యా గాయపడ్డ విషయం తెలిసిందే! ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పాండ్యా అందుబాటులో ఉండడని బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ జరిగిన రోజే తెలుసు. దీంతో అతడి స్థానంలో ఎవర్ని ఎంపిక చేస్తారన్నదానిపై ఫ్యాన్స్‌తో విశ్లేషకులు సైతం ఎవరి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. కొంతమంది ఇషాన్‌ కిషన్‌ అని.. మరి కొంతమంది అశ్విన్‌ని తీసుకోవాలంటూ అభిప్రాయపడ్డారు. ఇంకొంతమంది పేసర్ షమిని తుది జట్టులోకి తీసుకోని బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పైకి ప్రమోట్ చేయాలని చెప్పారు. చాలా మంది ఇదే జరుగుతుందని భావించగా.. పైనవి ఏవి కాకుండా ఇంకోటి జరిగింది.

జట్టులోకి సూర్యా భాయ్:
టీ20ల్లో నంబర్‌-1 ర్యాంకులో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌(Surya Kumar Yadav)ని తుది జట్టులోకి తీసుకుంది టీమిండియా. అతను టీ20ల్లో నంబర్‌-1 ప్లేయరే కానీ వన్డేల్లో మాత్రం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అసలు అతడిని వన్డే ప్లేయర్‌గా కన్సిడర్‌ చేసే గణాంకాలు కూడా లేవు. అతను కంప్లీట్ టీ20 ఆటగాడు. అయినా కూడా సూర్యని తుది జట్టులోకి తీసుకున్నాడు రోహిత్ శర్మ. దీనిపైనే ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్య కుమార్‌ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరుఫున ఆడుతాడు. ఆ జట్టుకు రోహిత్ కెప్టెన్‌ అన్న విషయం తెలిసిందే. వారిద్దరికి మంచి ఫ్రెండ్‌షిక్‌ కూడా ఉందని.. ఈ కోటాలోనే సూర్యాని ఆడిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వాదనను మరి కొందరు తప్పుపడుతున్నారు. పాత రికార్డులతో పని లేకుండా సూర్య కుమార్ సెలక్షన్‌ని స్వాగతించాలంటున్నారు. సూర్యా లాంటి ప్లేయర్‌కి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చడానికి 20 నుంచి 30 బంతులు చాలు అంటున్నారు.

నిలకడగా న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌:
అటు ఇప్పటివరకు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన జట్లుగా ఉన్న ఇండియా, న్యూజిలాండ్‌ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. నిజానికి ఇండియన్ బౌలర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. న్యూజిలాండ్‌ స్కోరు 9 వద్ద ఓపెనర్‌ కాన్వే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ యంగ్‌ కివీస్‌ స్కోర్ 19 వద్ద అవుట్ అయ్యాడు. కాన్వేని సిరాజ్‌ అవుట్ చేస్తే.. ఈ మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన స్పీడ్‌ స్టార్‌ షమి యంగ్‌ని అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ భారత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.

Also Read: కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయా? డార్క్ సర్కిల్స్‌ తగ్గించే టిప్స్ ఇవే!

#suryakumar-yadav #icc-world-cup-2023 #india-vs-newzealand
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe