/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pak-team-jpg.webp)
Pakistan Cricket Team: ఏదో ఆడడానికి వచ్చామా.. మటన్ లాగించేశామా.. మ్యాచ్‌లు ఓడిపోయామా.. ఇంటికి పోయామా అనుకుంటే చివరకు చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం. ఎవరూ ఏం చేయరులే.. మనమే దిక్కులే.. మనం లేకపోతే టీమ్ లేదులే అని అనుకుంటే బొక్క బొర్ల పడతారు.. అవసరం లేకపోతే ఎవర్ని అయినా ఉపేక్షించరు.. తీసి పక్కనపడేస్తారు. పాకిస్థాన్ క్రికెట్‌లోని కీలక ఆటగాళ్లకు వణుకు పుడుతోంది. వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరుకోలేకపోయిన పాకిస్థాన్ టీమ్ ప్లేయర్లకు.. స్వదేశానికి తిరిగి వెళ్లిన వెంటనే ఏ షాక్ వినాల్సి వస్తుందోనన్న టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజామ్‌కు మూడినట్లే అర్థమవుతోంది.
Pakistan are officially knocked out of the #CWC23 🇵🇰#Pakistan #Cricket #ENGvPAK #Sportskeeda pic.twitter.com/IeSF4BWmHU
— Sportskeeda (@Sportskeeda) November 11, 2023
ఇక ప్లేయర్‌గానే?
పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌పై వేటు పడడం ఖాయంగానే కనిపిస్తోంది. బ్యాటర్‌గా బాబర్ గొప్లే కావొచ్చు అని టీమ్‌ను ముందుండి నడిపించడంలో బాబర్ ఫెయిల్ అయ్యాడని అన్ని వైపుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాక్ మాజీ ఆటగాళ్లు బాబర్‌పై చాలా సిరీయస్‌గా ఉన్నారు. అసలు అతని ఆలోచనా తీరులో ఎక్కడా కూడా దూకుడుగా నిర్ణయం తీసుకునే స్వభావం లేదంటున్నారు. పసికూన అఫ్ఘాన్‌పై పాకిస్థాన్‌పై ఓడిపోవడాన్ని ఆ జట్టు మాజీలు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్ తర్వాత బాబర్ అజామ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. అఫ్గాన్ బ్యాటర్లకు బాబర్ సెట్ చేసిన ఫీల్డింగ్ పూర్తి స్వేచ్ఛనిచ్చిందని.. అందుకే వాళ్లు ఎక్కడా తడపడకుండా బ్యాటింగ్ చేయగలిగారని మాజీలు అభిప్రాయపడ్డారు.
Pakistan's World Cup campaign summarised in one dismissal #CWC23 #EngvPak pic.twitter.com/vcTNFalASS
— Saj Sadiq (@SajSadiqCricket) November 11, 2023
బాబర్‌తో పాటు రవూఫ్?
అటు అఫ్ఘాన్‌పై మ్యాచే కాదు.. దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లోనూ కెప్టెన్‌గా బాబర్ ఫెయిల్ అయ్యాడు. దక్షిణాఫ్రికాపై మ్యాచ్ చివరి వికెట్ కోసం ఉసామా మిర్‌కు బౌలింగ్ ఇవ్వకుండా నవాజ్‌కు బౌలింగ్ ఇచ్చాడు బాబర్. ఆ మ్యాచ్‌లో నవాజ్‌కు బౌలింగ్ ఇచ్చాడు బాబర్. అందుకే దక్షిణాఫ్రికా గెలిచందన్న వాదనను ఇప్పటికీ మాజీలు వినిపిస్తున్నారు. అటు బౌలింగ్‌లోనూ పాకిస్థాన్ జట్టు ఘోరంగా ఫెయిల్ అయ్యింది. మునుపెన్నడూ లేని విధంగా సగానికి పైగా మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు బౌలర్లు. ఈ లెక్కన చూస్తే పాక్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో పలువురు ఆటగాళ్లపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: 48ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అతి చెత్త రికార్డు.. తల కొట్టుకున్న పాకిస్థాన్ లెజెండ్స్!
WATCH: