World Cup 2023: వరల్డ్‌కప్‌లో సెమీస్‌ బెర్తులు ఫిక్స్‌.. భారత్‌ అభిమానుల్లో టెన్షన్..!

వరల్డ్‌కప్‌లో సెమీస్‌ బెర్త్‌లు ఫిక్స్‌ అయ్యాయి. ఈ నెల 15న ముంబై వేదికగా ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి సెమీస్‌ జరగనుండగా.. ఈ నెల 16న ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.

New Update
World Cup 2023: వరల్డ్‌కప్‌లో సెమీస్‌ బెర్తులు ఫిక్స్‌.. భారత్‌ అభిమానుల్లో టెన్షన్..!

2019 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌లో ఓడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేరు. గ్రూప్‌ దశలో అద్భుతంగా ఆడుతూ సెమీస్‌కు వచ్చిన భారత్‌.. సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయింది. గ్రూప్‌ స్టేజీలో అదరగొట్టిన భారత్ బ్యాటర్ల సెమీస్‌లో మాత్రం విఫలమయ్యారు. ఆల్‌రౌండర్‌ జడేజా జట్టును గెలిపించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇక ఈ వరల్డ్‌కప్‌లోనూ టీమిండియా గ్రూప్‌ స్టేజీలో ఇప్పటివరకు అన్ని మ్యాచ్‌లు గెలిచింది. రేపు(నవంబర్ 12) నెదర్లాండ్స్‌తో టీమిండియా గెలుపు ఈజీనే. అంటే మరోసారి ఓటమే లేకుండా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాం. ఇక్కడ వరకు బాగానే ఉన్న సెమీస్‌లో మన ప్రత్యర్థిని చూసి అభిమానులు కాస్త టెన్షన్‌ పడుతున్నారు.


రెండు బెర్తులు ఫిక్స్:

ఇంగ్లండ్‌పై తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 3 ఓవర్లలోనే టార్గెట్‌ ఛేజ్‌ చేయాల్సి ఉన్న పాకిస్థాన్‌ ఇంటికి వెళ్లిపోయింది. నిజానికి న్యూజిలాండ్‌ సెమీస్‌ బెర్త్‌ ఎప్పుడో ఫిక్స్ అయినా ఆఫిషియల్‌గా డిక్లేర్‌ అవ్వడానికి అన్ని సమీకరణలు సెట్ అవ్వాల్సిందే. ఇక తాజాగా పాక్‌ ఆఫిషియల్‌గా సెమీస్‌ రేస్‌ నుంచి ఔట్ అవ్వడంతో న్యూజిలాండ్‌(Newzealand) వర్సెస్‌ ఇండియా(India) సెమీస్‌ ఫైట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 15 ముంబై వాంఖడే వేదికగా కివీస్‌తో తలపడనుంది రోహిత్ సేన. అటు 16న ఆస్ట్రేలియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

అది జరగకూడదు దేవుడా:

ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్‌లో టీమిండియా న్యూజిలాండ్‌పైనే సెమీస్‌లో ఓడిపోయింది. ఇదే విషయాన్ని గుర్తు చేసుకోని ఫ్యాన్స్‌ టెన్షన్ పడుతున్నారు. అందులోనూ భారత్ జట్టు ఇటీవల కాలంలో సెమీస్‌లోనే ఎక్కువగా చోక్‌ అవుతుంది. మరోసారి అదే జరుగుతుందానని భయపడుతున్నారు. అయితే ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా తిరుగులేని ఫామ్‌లో ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్‌ను గ్రూప్‌ స్టేజ్‌లో మట్టికరిపించింది. 20ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్లలో కివీస్‌ను భారత్‌ ఓడించడం అదే తొలిసారి. అందుకే అదే ఫామ్‌ను కంటీన్యూ చేస్తూ సెమీస్‌లో కివీస్‌ను ఓడిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: బోయ్ ఆస్ట్రేలియా.. లాస్ట్‌ మ్యాచ్‌లోనూ ఉతికి ఆరేసిందిగా!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు