Maxwell: అబ్బా.. ఏమన్నా ఆడాడా భయ్యా.. 'నేనేమో ఒక్క పరుగు తియ్యడానికి 40 బంతులు ఆడాను'! వరల్డ్‌కప్‌లో తనకు ఒక్క పరుగు చేయడానికి ఓ మ్యాచ్‌లో 40 బంతులు ఆడాల్సి వచ్చిందని.. అదే మ్యాక్స్‌వెల్ అన్నే బంతుల్లో సెంచరీ చేశాడంటూ అతడిని ఆకాశానికి ఎత్తేశాడు సునీల్ గవాస్కర్. నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో 40 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌తో అతను ఆడిన రివర్స్ స్వీప్ సిక్సర్‌కు 6 పరుగులు ఇస్తే సరిపోదని.. 12 రన్స్ ఇవ్వాలంటూ తనదైన స్టైల్‌లో కామెంట్స్ చేశారు సన్ని. By Trinath 26 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి 'బాల్ ఎలా వస్తే నాకేంటి.. నాకు నచ్చిన సైడ్ బౌండరీ బాదుతాను.. నువ్వు ఇన్‌స్వింగర్ వేసుకో.. అవుట్ స్వింగర్ వేసుకో.. నేను మాత్రం మైండ్‌లో సిక్స్ కొట్టాలని డిసైడ్ అయితే బ్లైండ్‌గా బౌండరీ బయట బాల్ పడాల్సిందే. గుర్తుపెట్టుకో.. నా పేరు మ్యాక్స్‌వెల్..!' ఇది బాలయ్య బాబు సినిమా డైలాగ్ కాదు కానీ.. సినిమాలకు సెట్ అయ్యే డైలాగ్. నెదర్లాండ్స్‌పై రికార్డు సెంచరీ చేసిన ఈ ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్యుల నుంచి దిగ్గజాల వరకు మ్యాక్సీ(Maxwell) ఆటను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా మ్యాక్సీ షాట్లకు ఫిదా ఐపోయారంతా. అందులో ఆ రివర్స్ స్వీప్ సిక్స్ అయితే మాములుగా లేదు.. లూప్‌లో పెట్టుకోని చూసే సిక్స్ అది. నిన్నటి నుంచి ఆ షాట్‌ను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదన్న డైలాగ్ అభిమానుల నోట నుంచి వినిపిస్తోంది. అటు దిగ్గజాలు సైతం ఎవరి స్టైల్‌లో వారు స్పందిస్తుండగా.. తాజాగా క్రికెట్ లెజెండ్, టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ మ్యాక్సీని ఆకాశానికి ఎత్తేశాడు. Glen Maxwell What A Shot🔥🔥🔥#NEDvsAUS #WorldCup2023 pic.twitter.com/Wsyogc8Dq9 — Cricket Pitch 🏏 (@PitchBreaker) October 25, 2023 40 బంతుల్లో సింగిల్: ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 40 బంతుల్లోనే సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచ కప్ చరిత్రలో ఫాసెస్ట్ సెంచరీ. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఐడెన్ మార్క్రామ్ 49 బంతుల్లో సెంచరీ చేయగా.. ఆ రికార్డును మ్యాక్సీ లేపేశాడు. ఈ ఆసీస్ హిట్టర్ రికార్డుపై గవాస్కర్ స్పందించారు. తనకు వరల్డ్‌కప్‌లో ఒక్క పరుగు తియ్యడానికి 40 బంతులు పడితే.. మ్యాక్సీ అవే బంతుల్లో 100 పరుగులు చేశాడంటూ ప్రశంసించాడు. ఇక మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌తో అతను ఆడిన రివర్స్ స్వీప్ సిక్సర్‌కు 6 పరుగులు ఇస్తే సరిపోదని.. 12 రన్స్ ఇవ్వాలంటూ తనదైన స్టైల్‌లో కామెంట్స్ చేశారు సన్ని. ఆ సిక్స్ కొట్టిన తర్వాత నెదర్లాండ్స్ బౌలర్లకు అసలు ఎక్కడ బంతి వెయ్యాలో అర్థంకాలేదన్నారు. గవాస్కర్ చెప్పింది అక్షరాల నిజమే. బాల్ ఎక్కడ పిచ్ అయినా మ్యాక్సీ మాత్రం పిచ్చి కొట్టుడుకొట్టాడు. గవాస్కర్ (ఫైల్) అందుకే ఇలా ఆడగలిగా: మ్యాక్స్‌వెల్‌తో పాటు వార్నర్ కూడా సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 399 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియాలో ఆడిన అనుభవం ఉండడంతో రన్స్ ఈజీగా చేయగలిగానన్నాడు మ్యాక్స్‌వెల్. మొత్తంగా 44 బంతుల్లో 106 రన్స్ చేసిన మ్యాక్సీ ఖాతాలో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అటు వన్డేల్లో వేగవంతమైన సెంచరీ జాబితాలో మాక్స్‌వెల్ నాలుగో స్థానంలోకి దూసుకొచ్చాడు. ఈ లిస్ట్‌లో తొలి స్థానంలో ఏబీడీ ఉన్నాడు. 2015లో జోబర్గ్ వేదికగా వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో సెంచరీ చేశాడు. Also Read: మ్యాచ్ విన్నర్‌నే పక్కన పెడుతున్నారా.. ఇదేంటి రోహిత్ బ్రో? #cricket #icc-world-cup-2023 #glen-maxwell మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి