Pakistan is one of the most under performing teams in WC history: పాకిస్థాన్ జట్టు మోస్ట్ ఓవరరేటెడ్ క్రికెట్ టీమ్. గతాన్ని పక్కన పెడదాం.. చివరి ఆరు వరల్డ్‌కప్‌ల్లో పాక్ ఆట తీరు ఘోరం. పసికూనలు కూడా సెమీస్ వరకు వచ్చాయి కానీ పాక్ జట్టుకు అది కూడా చేతకాలేదు. పేరుకేమో గొప్ప గొప్ప ప్లేయర్లు.. పేపర్‌పై పులులు.. మైదనంలో పిల్లిలు.. కాదు కాదు పిల్లిని అవమానించడం కరెక్ట్ కాదు.. గదిలో బంధిస్తే పిల్లి కూడా పులి అవుతుంది..అది కూడా తిరగబడుతుంది. కానీ పాకిస్థాన్ ప్లేయర్లుకు ఎప్పుడు తిండిగోలే కానీ ఆటపై డెడికేషన్ లేదు.. ఇది ఆ దేశ అభిమానులే చెబుతున్న మాటలు. ఎలాంటి టీమ్ ఎలాంటి స్థితికి వచ్చిందోనని పాక్ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. కొంతమంది బాధతో బిర్యానీ కూడా తినడం లేదని సమాచారం. అయితే వాళ్ల ఆవేదనకు అర్థముంది. ఎందుకో మీరే తెలుసుకోండి.
2003 నుంచి ఇంతే:
2003 ప్రపంచకప్ నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు వరల్డ్‌కప్ జరిగితే అందులో ఐదు సార్లు పాకిస్థాన్ సెమీస్ చేరుకోవడంలో విఫలమైంది. 2003 వరల్డ్‌కప్‌లో కెన్యా సెమీస్‌కు వచ్చిందన్న విషయం మారువద్దు. ఆ ప్రపంచకప్‌లో పాక్ హేమాహేమీలతో బరిలోకి దిగింది. అయినా కూడా సెమీస్‌కు వెళ్లలేదు. ఇక 2007 ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజీలోని ఇంటిముఖం పట్టింది. ఐర్లాండ్‌పై ఓటమి పాక్ జట్టు కొంపముంచింది. ఇక 2011 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్‌కు వచ్చింది. అక్కడ ఇండియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 2015, 2019, 2023 ప్రపంచకప్‌ల్లో పాక్ సెమీస్ గడప తొక్కలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాక్ జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు ఫ్యాన్స్. మోస్ట్ ఓవర్‌రేటెడ్ టీమ్ పాకిస్థానేనంటున్నారు.
ఈ వరల్డ్‌కప్ మరింత ఘోరం:
సెమీస్‌కు వచ్చే జట్లలో పాకిస్థాన్ కూడా ఉంటుందని ఈ వరల్డ్‌కప్ స్టార్ట్ అవ్వడానికి ముందు విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఫస్ట్ రెండు మ్యాచ్‌ను పాక్ గెలిచింది. ఆ తర్వాత అహ్మదాబాద్ వేదికగా భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది పాక్. అక్కడ నుంచి పాక్ మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్ చేతిలో పరాజయం పాలవడం ఆ జట్టు ఘోర స్థితికి నిదర్శనం. రెండు మ్యాచ్‌లు గెలిచాం లేనన్న అలసత్వం పాక్ ప్లేయర్లలో స్పష్టంగా కనిపించిందంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో అన్నిటికంటే దారుణంగా విఫలమైన ఇంగ్లండ్ చేతిలోనూ పాక్ జట్టు ఘోరంగా ఓడిపోయింది.
Also Read: 48ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అతి చెత్త రికార్డు.. తల కొట్టుకున్న పాకిస్థాన్ లెజెండ్స్!
WATCH: