World Cup: జట్టులో నలుగురు ఆటగాళ్లకు తీవ్ర జ్వరం, ఛాతిలో ఇన్‌ఫెక్షన్.. అసలేం జరుగుతోంది? దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే. పాపం దాయాది జట్టుకు ఏదీ కలిసి రావడంలేదు. వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మందు పాక్‌కు గట్టి షాక్ తగిలింది. పాక్ జట్టులో నలుగురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ తీవ్ర జ్వరంతో పాటు ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని సమాచారం. By Trinath 17 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి పాకిస్థాన్(Pakistan) జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇండియాపై మ్యాచ్‌లో ఓటమితో ఇప్పటికే తీవ్ర నిరాశతో ఉన్న జట్టుకు మరో గట్టి షాక్ ఇది. పాక్ జట్టులో నలుగురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. హై ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఛాతిలో ఇన్‌ఫెక్షన్ కూడా ఉన్నట్టు సమాచారం. ఒక్కసారిగా ఇలా ఎలా సిక్ అయ్యారన్నది అర్థంకాని పరిస్థితి. షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. షాహీన్ అఫ్రిది(Shaheen Afridi) బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడని తెలుస్తోంది. ఇది పాక్ జట్టును కలవరపెడుతోంది. Image Source/NDTV కాన్ఫిడెన్స్ లేదు.. ప్లేయర్లు కూడా లేరు: పాకిస్థాన్ తన తర్వాతి మ్యాచ్‌ని ఆస్ట్రేలియాపై ఆడనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది. గత మ్యాచ్‌లో పాక్ జట్టు ఇండియాపై చావు దెబ్బ తిన్నది. ఏడు వికెట్ల తేడాతో రోహిత్ సేన బాబర్ అజామ్ టీమ్‌ని మట్టికరిపించింది. అంతకముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్ గెలిచింది. అయితే ఇండియాపై ఓటమి ఆ జట్టు కాన్ఫిడెన్స్‌ని గట్టిగానే దెబ్బతీసింది. ఆ దేశ అభిమానులు, మాజీలు పాక్ టీమ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా తన మొదటి రెండు మ్యాచ్‌లను ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచింది. దీంతో ఆ జట్టులో కాన్ఫిడెన్స్ పెరిగింది. నెక్ట్స్ మ్యాచ్ డౌటే: ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాక్‌కి నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే నెట్‌రన్‌రేట్ మాత్రం మైనస్‌ల్లోకి పడిపోయింది. ఇండియాపై మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాక్ నెట్‌రన్‌రేట్ పడిపోయింది. ఇప్పుడు పాక్ నెట్‌రన్‌రేట్‌ని కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో నలుగురు ఆటగాళ్లు జ్వరం బారిన పడడం.. అది కూడా హై ఫీవర్ ఉండడంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు కీలక ఆటగాళ్లు దూరం అయ్యే చాన్స్ ఉంది. అస్వస్థకు గురైన పాక్ ఆటగాళ్లు ప్రస్తుతం వైద్యల పర్యవేక్షణలో ఉన్నారు. పాకిస్థాన్ మీడియా మేనేజర్ మాత్రం ప్లేయర్లు కోలుకుంటున్నారని చెప్పారు. ALSO READ: హిట్‌మ్యాన్‌ని ఆపేదేవడు.. రోహిత్‌ను ఊరిస్తున్న మరో అరుదైన రికార్డు..! #pakistan-cricket-team #shaheen-afridi #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి