BREAKING: పాకిస్థాన్‌ క్రికెట్‌లో భారీ కుదుపు.. బాబర్‌ అజమ్‌ సంచలన నిర్ణయం..!

ప్రపంచకప్‌లో పాక్‌ జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా తాను కెప్టెన్సీ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బాబర్ ఆజం ప్రకటించాడు. మూడు ఫార్మెట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు చెప్పాడు.

BREAKING: పాకిస్థాన్‌ క్రికెట్‌లో భారీ కుదుపు.. బాబర్‌ అజమ్‌ సంచలన నిర్ణయం..!
New Update

BABAR AZAM: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో అందరికంటే ఎక్కువగా తమ జట్ల అభిమానులు బాధ పెట్టిన టీమ్స్‌ రెండే రెండు.. ఒకటి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, రెండోది పాకిస్థాన్‌. ఈ రెండు జట్లు సెమీస్‌కు వస్తాయని అంతా భావించారు. భారత్ పిచ్‌లు పాక్‌కు అనుకూలంగా ఉంటాయని.. హేమాహేమీల లాంటి బ్యాటర్లు, బౌలింగ్‌ దళం ఆ జట్టు సొంతమని అంతా అనుకున్నారు. కానీ వరల్డ్‌కప్‌లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. పడుతూలేస్తూ సాగిన పాకిస్థాన్‌ ప్రయాణం చివరకు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. దీంతో అన్ని వైపుల నుంచి పాక్‌ టీమ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా బాబర్‌ అజమ్‌పై మాజీలు మండిపడ్డారు ఈ క్రమంలోనే బాబర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మూడు ఫార్మెట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.


ఊహించిందే:
నిజానికి కెప్టెన్‌గా బాబర్‌ అజామ్‌పై వేటు పడడం ఖాయమని ముందునుంచే ప్రచారం జరిగింది. బ్యాటర్‌గా బాబర్‌ గొప్లే కావొచ్చు అని టీమ్‌ను ముందుండి నడిపించడంలో బాబర్‌ ఫెయిల్ అయ్యాడని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పాక్‌ మాజీ ఆటగాళ్లు బాబర్‌పై చాలా సిరీయస్‌ అయ్యారు. అసలు అతని ఆలోచనా తీరులో ఎక్కడా కూడా దూకుడుగా నిర్ణయం తీసుకునే స్వభావం లేదన్నారు. పసికూన అఫ్ఘాన్‌పై పాకిస్థాన్‌పై ఓడిపోవడాన్ని ఆ జట్టు మాజీలు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌ తర్వాత బాబర్‌ అజామ్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ పెరిగింది. అఫ్గాన్‌ బ్యాటర్లకు బాబర్‌ సెట్ చేసిన ఫీల్డింగ్‌ పూర్తి స్వేచ్ఛనిచ్చిందని.. అందుకే వాళ్లు ఎక్కడా తడపడకుండా బ్యాటింగ్‌ చేయగలిగారని మాజీలు అభిప్రాయపడ్డారు.

ఇక సెమీస్‌కు వచ్చే జట్లలో పాకిస్థాన్‌ కూడా ఉంటుందని ఈ వరల్డ్‌కప్‌ స్టార్ట్ అవ్వడానికి ముందు విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఫస్ట్ రెండు మ్యాచ్‌ను పాక్‌ గెలిచింది. ఆ తర్వాత అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది పాక్‌. అక్కడ నుంచి పాక్‌ మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్‌ చేతిలో పరాజయం పాలవడం ఆ జట్టు ఘోర స్థితికి నిదర్శనం. రెండు మ్యాచ్‌లు గెలిచాం లేనన్న అలసత్వం పాక్‌ ప్లేయర్లలో స్పష్టంగా కనిపించిందంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో అన్నిటికంటే దారుణంగా విఫలమైన ఇంగ్లండ్‌ చేతిలోనూ పాక్‌ జట్టు ఘోరంగా ఓడిపోయింది.

Also Read: 50వ సెంచరీ కాదు.. కోహ్లీ ఖాతాలో చేరిన ఈ రికార్డును బ్రేక్‌ చేయాలంటే దేవుడే రావాలి!

#cricket #pakistan-cricket-team #babar-azam #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe