Cricket: వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌ను ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదా..? కెప్టెన్ ప్రెస్‌మీట్‌కు ఇద్దరే మీడియా రిపోర్టర్లు! వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే మరో సిరీస్ షెడ్యూల్ ప్లాన్ చేయడం పట్ల బీసీసీఐపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విశాఖ టీ20 మ్యాచ్‌కు లోకల్ క్రౌడ్ భారీగా వచ్చినా టీవీలో మ్యాచ్ చూసిన వారి సంఖ్య తక్కువగా ఉంది. అటు కెప్టెన్ సూర్య ప్రెస్‌మీట్‌కు కేవలం ఇద్దరు రిపోర్టర్లే వచ్చారు. By Trinath 25 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఈ ఏడాది వరల్డ్‌కప్(World cup) ఎడిషన్ చప్పగా స్టార్ట్ అయినా ఎండింగ్‌కి వచ్చే సరికి మాత్రం వ్యూయర్‌షిప్ దుమ్ములేపింది. అక్టోబర్ 14న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నుంచి వీక్షకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అఫ్ఘాన్ సంచలన విజయాలు కూడా మంచి వ్యూయర్‌షిప్‌కి ప్రధాన కారణం. ఇక వరల్డ్‌కప్ పైనల్‌కు హాట్‌స్టార్‌లో రికార్డు వ్యూస్ వచ్చాయి. అయితే ఫైనల్‌లో ఇండియా మ్యాచ్ ఓడిపోవడం అభిమానులను తీవ్రంగా నిరారపరిచింది. ఇప్పటికీ ఫైనల్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇంతలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఇండియా రెడీ అవ్వడంతో ఈ మ్యాచ్‌ను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. From 200 odd media people (during World Cup) to just two in press conference in India is staggering! SKY wouldn’t have imagined this in his firstPC as captain. Is this a record with fewest attendance in a press conference in India? I would imagine so. pic.twitter.com/O41WbIUKla — Vimal कुमार (@Vimalwa) November 22, 2023 సూర్య ప్రెస్‌మీట్‌కు ఇద్దరే: వరల్డ్‌కప్ ముగిసిన నాలుగో రోజే విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇండియా తలపడింది. ఈ టీ20 సిరీస్‌కు సీనియర్లకు రెస్ట్ ఇచ్చారు. సూర్యకుమార్‌యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మ్యాచ్‌కు ముందు ప్రెస్ మీట్ పెట్టడం ఒక ట్రెడీషన్. అలానే సూర్య కూడా ప్రెస్‌మీట్‌కు వచ్చాడు. అక్కడకి వచ్చి చూస్తే ఇద్దరే కనిపించారు. తానెమైనా ముందే వచ్చానా అని సూర్య ఆశ్చర్యపోయాడు. అయితే ఎంత సేపు చూసినా తర్వాత ఏ రిపోర్టర్ కూడా అక్కడ అడుగుపెట్టలేదు. '200 మంది బేసి మీడియా వ్యక్తుల నుంచి (ప్రపంచ కప్ సమయంలో) విలేకరుల సమావేశంలో కేవలం ఇద్దరు మాత్రమే ఉండడం ఆశ్చర్యం కలిగించింది! కెప్టెన్‌గా తన మొదటి PCలో సూర్య దీనిని ఊహించి ఉండడు. దేశంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతి తక్కువ మంది హాజరైన రికార్డు ఇదేనా? నేను అలా ఊహించుకుంటాను' అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నిజానికి సూర్య ముందున్న మైకులు కూడా ANI, PTIలవి. అవి న్యూస్ ఏజెన్సీలు. వరల్డ్‌కప్ ముగిసిన నాలుగో రోజే మ్యాచ్ పెట్టడంపై అభిమానులు కూడా మండిపడుతున్నారు. డబ్బులు కోసం బీసీసీఐ ఇలా దిగజారుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. Also Read: RCBకి రోహిత్ శర్మ..? పూనకాలు లోడింగ్…! WATCH: #cricket #surya-kumar-yadav #india-vs-australia #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి