IND vs PAK: ఇండియాపై గెలవడం పాక్‌ తరం కాదు.. వరుసగా ఎనిమిదో సారీ మనదే విక్టరీ!

గుజరాత్ అహ్మదాబాద్‌ స్టేడియంలో పాక్‌పై జరిగిన పోరులో భారత్‌ విక్టరీ కొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో పాక్‌ బౌలర్లను ఉతికి ఆరేశాడు. గత మ్యాచ్‌లో అఫ్ఘాన్‌పై చెలరేగిన ఫామ్‌ని కొనసాగిస్తూ రెచ్చిపోయి ఆడాడు. రోహిత్ దూకుడుతో పాక్‌ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. రోహిత్ దూకుడుతో టీమిండియా ఈజీగా గెలిచేసింది.

author-image
By Trinath
New Update
IND vs PAK: ఇండియాపై గెలవడం పాక్‌ తరం కాదు.. వరుసగా ఎనిమిదో సారీ మనదే విక్టరీ!

ప్రపంచ కప్‌(Worldcup)లో పాకిస్థాన్‌(Pakistan)పై భారత్‌ తమ డామినేషన్‌ని కంటీన్యూ చేసింది. గుజరాత్ అహ్మదాబాద్‌ స్టేడియంలో జరిగిన పోరులో భారత్‌ విక్టరీ కొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో పాక్‌ బౌలర్లను ఉతికి ఆరేశాడు. గత మ్యాచ్‌లో అఫ్ఘాన్‌పై చెలరేగిన ఫామ్‌ని కొనసాగిస్తూ రెచ్చిపోయి ఆడాడు. రోహిత్ దూకుడుతో పాక్‌ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. గిల్‌, కోహ్లీ త్వరగానే ఔటైనా అయ్యర్‌తో కలిపి రోహిత్‌ సూపర్‌ పార్టనెర్‌షిప్‌ నెలకొల్పాడు. తనదైన ట్రేడ్ మార్క్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రోహిత్ దూకుడుతో టీమిండియా ఈజీగా గెలిచేసింది. 30.3 ఓవర్లలోనే భారత్ 193 రన్స్ టార్గెట్ ని ఛేజ్ చేసింది.

నిలబడి..తడపడి..కూప్పకూలి:

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 192 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 42.5 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. నిజానికి పాక్ ఒక దశలో 300 రన్స్ చేస్తుందని అంతా భావించారు. కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీ టెక్‌టిక్స్‌తో పాక్‌ ఆటలు ఎక్కువగా సాగలేదు. టాస్‌ గెలిచిన రోహిత్ ఫీల్డింగ్‌ తీసుకున్నాడు. భారత్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ బౌండరీలతో జోరు పెంచిన పాక్‌ను సిరాజ్‌ దెబ్బకొట్టాడు. 24 బంతుల్లో 20 రన్స్ చేసిన అబ్దుల్లాను LBW చేశాడు. ఇక ఆ తర్వాత 6 బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించిన ఇమామ్‌ ఉల్‌ హక్‌ని హార్దిక్‌ పాండ్యా అవుట్ చేశాడు. 38 బంతుల్లో 36 రన్స్ చేసిన ఇమామ్‌ కీపర్‌ రాహుల్‌ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిజ్వాన్‌తో కలిసి బాబర్‌ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టారు. 58 బంతుల్లో 50 రన్స్ చేసిన బాబర్‌ని సిరాజ్‌ బోల్తా కొట్టించాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో బాబర్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇక ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌కి వచ్చాడు. హాఫ్‌ సెంచరీవైపు సాగుతున్న రిజ్వాన్‌ని బుమ్రా అవుట్ చేశాడు. 69 బాల్స్‌లో 49 రన్స్ చేసిన రిజ్బాన్‌ బుమ్రా బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక ఆ తర్వాత టీమిండియా మరింత రెచ్చిపోయి బౌలింగ్ చేసింది. షకీల్‌, ఇఫ్తికార్‌, షాదబ్‌ ఖాన్‌ ముగ్గురూ కూడా సింగిల్‌ డిజిట్‌కే అవుట్ అయ్యారు. దీంతో ఒక దశలో 300 రన్స్ చేస్తుందనుకున్న పాక్‌ ఘోరంగా 191 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది.

రోహితా మజాకా?

ఇక టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ, గిల్ గ్రేట్‌ స్టార్ట్ ఇచ్చారు. డెంగీ బారి నుంచి కోలుకోని బ్యాటింగ్ చేసిన గిల్ వరుస ఫోర్లతో అలరించాడు. అయితే అయితే షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో గిల్ 16 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ తన ట్రేడ్‌ మార్క్‌ కవర్‌ డ్రైవ్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. అయితే కోహ్లీ కూడా 16 రన్స్ వద్దే హసన్‌ అలీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ రెచ్చిపోతూనే ఉన్నాడు. సిక్సర్లతో పాక్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 63 బంతుల్లోనే 86 రన్స్ చేసిన రోహిత్ షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే టీమిండియా గెలుపు కన్‌ఫామ్‌ అయ్యింది.

ALSO READ: రోహిత్‌ శర్మ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్‌ స్వరూపమే మరిపోయింది భయ్యా..నువ్వు కేక బ్రో!

Advertisment
Advertisment
తాజా కథనాలు