Rohit Sharma: రికార్డుల ఊచకోత.. వారికి గట్టిగా ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్‌..!

రోహిత్ శర్మ సిక్సర్ల ఊచకోత కొనసాగుతోంది. పాక్‌పై మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 86 రన్స్ చేసిన రోహిత్ ఖాతాలో కొత్త రికార్డులు వచ్చి చేరాయి. ఒకే ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ ఫస్ట్ ఉన్నాడు. 33 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో రోహిత్ నాలుగు సార్లు 60కు పైగా సిక్సులు కొట్టాడు.

Rohit Sharma: రికార్డుల ఊచకోత.. వారికి గట్టిగా ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్‌..!
New Update

రోహిత్‌ శర్మ(Rohit sharma) బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. ఎన్ని విమర్శలు వచ్చినా నోరు విప్పాడు. రోహిత్ శర్మ బ్యాట్‌తో చెప్పే సమాధానం కూడా ఏదో సాధారణంగా ఉండదు. రికార్డులు, సిక్సర్లతోనే అందరీ నోళ్లు మూయిస్తాడు. ప్రపంచకప్‌కి ముందు రోహిత్ బ్యాటింగ్‌ని వేలు ఎత్తి చూపిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు వారి నోటి నుంచి ఎలాంటి మాట వినపడడం లేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ తర్వాత అఫ్ఘాన్‌పై జరిగిన మ్యాచ్‌లో రికార్డు సెంచరీ చేశాడు. 63 బాల్స్‌లోనే సెంచరీ చేసిన రోహిత్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌ తరుఫున వేగంగా 100 పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక సిక్సర్ల విషయంలోనూ గేల్‌ రికార్డు గత మ్యాచ్‌లోనే బద్దలైంది. అయితే అఫ్ఘాన్‌పై కొట్టడం కాదు పాకిస్థాన్‌(Pakistan)పై కొట్టాలంటూ కొంతమంది కామెంట్స్ చేశారు. వారందరికి గట్టిగా ఇచ్చిపడేశాడు రోహిత్

పాక్‌పై ఊచకోత:

గత మ్యాచ్‌లో వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు రికార్డును బ్రేక్ చేసిన రోహిత్.. పాక్‌పై పోరులోనూ రికార్డుల మోత మోగించాడు. 63 బంతుల్లోనే 86 రన్స్ చేసిన రోహిత్ ఖాతాలో కొత్త రికార్డులు వచ్చి చేరాయి. పాకిస్థాన్‌పై వరల్డ్‌కప్‌లో కెప్టెన్సీ పరంగా ఇదే హయ్యస్ట్ స్కోర్‌. మరోవైపు వన్డేల్లో 300 సిక్సులు కంప్లీట్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. విశేషం ఏంటంటే.. రోహిత్‌ తన చివరి 18 ఇన్నింగ్స్‌లలో 47 సిక్సర్లు బాదాడు. ఇక రోహిత్ అరుదైన ఫీట్ సాధించాడు. ప్రపంచ కప్‌ ఛేజింగ్‌లో ఏడు సార్లు భారత్ తరుఫున 50కు పైగా పరుగులు చేసిన ప్లేయర్‌ రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్‌ తర్వాతి స్థానంలో క్రికెట్ గాడ్‌ సచిన్ ఉన్నాడు.. సచిన్‌ ఆరు సార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. 2011 వరల్డ్‌కప్‌ హీరో యువరాజ్‌ 5సార్లు ఈ ఘనత సాధించాడు

అటు సిక్స్‌ రికార్డుల్లో రోహిత్‌కి పోటి వచ్చే ఆటగాడు దరిదాపుల్లో కూడా లేడు. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 60కు పైగా సిక్సులు కొట్టిన జాబితాలో రోహిత్ ఫస్ట్ ఉన్నాడు. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో రోహిత్ ఈ ఫీట్ నాలుగు సార్లు సాధించాడు. 2017, 2018,2019, 2023 క్యాలెండర్‌ ఇయర్లలో రోహిత్ 60 సిక్సులు బాదాడు. ఇక ఈ సంవత్సరం ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. లిస్ట్‌లో మిగిలిన ప్లేయర్లు కేవలం ఒక్కసారే ఈ ఫీట్ సాధించారు. ఇక ఒకే ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ మరెవరికి అందనంతా దూరంలో ఉన్నాడు. 33 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో రోహిత్ 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సులు కొట్టాడు. రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్న సెహ్వాగ్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సులు 10సార్లు కొట్టాడు. ప్రపంచంలో గేల్‌ ఈ జాబితాలో ముందున్నాడు. 38 సార్లు గేల్‌ ఈ ఫీట్ సాధించగా.. రోహిత్‌ విండీస్‌ వీరుడి రికార్డును అతి త్వరలోనే బ్రేక్ చేయనున్నాడు.

ALSO READ: దోమను బ్యాట్‌తో బాదేసిన గిల్‌.. నువ్వు దేవుడివి సామీ.. ఇక ప్రత్యర్థులు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే!

#rohit-sharma #icc-world-cup-2023 #india-vs-pakistan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe