IND vs BAN: సెంచరీతో కదం తొక్కిన కింగ్‌ కోహ్లీ.. బంగ్లా బొక్క బోర్లా..!

కింగ్ కోహ్లీ మరోసారి మెరిశాడు. వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా సేట్ చేసిన 257 రన్స్ టార్గెట్‌ని టీమిండియా 41.3 ఓవర్లలోనే ఛేజ్‌ చేసింది.

IND vs BAN: సెంచరీతో కదం తొక్కిన కింగ్‌ కోహ్లీ.. బంగ్లా బొక్క బోర్లా..!
New Update

వరల్డ్‌కప్‌లో టీమిండియా మరో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. పూణేలో బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా కింగ్‌ కోహ్లీ సెంచరీతో దుమ్మురేపాడు. కోహ్లీ సెంచరీతో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 97 బంతుల్లో 103 పరుగులు చేసిన కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు. అటు రోహిత్‌ శర్మ తన ఫామ్‌ని కంటిన్యూ చేస్తు టీ20 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. మరో ఓపెనర్‌ గిల్‌ సైతం ఆకట్టుకున్నాడు.

ఓపెనర్లు అదుర్స్.. మిడిల్ ఢమాల్:
టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కి దిగింది. బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. తన్జిద్‌, లిట్టన్‌ దాస్‌ భారత్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 43 బంతుల్లో 51 రన్స్ చేసిన తన్జిద్‌ హసన్‌ కుల్దీప్‌ బౌలింగ్‌ అవుట్ ఆయ్యాడు. తన్జిద్‌ అవుటైన తర్వాత కాసేపటికే కెప్టెన్ నజ్ముల్ జడేజా బౌలింగ్‌లో LBW అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మిరాజ్‌ కూడా తుస్సుమన్నాడు. 13 బాల్స్ ఆడి కేవలం 3 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే లిట్టన్‌ దాస్‌ కూడా అవుట్ అవ్వడంతో బంగ్లాదేశ్‌ పీకల్లోతు కష్టాల్లో పడినట్టు అయ్యింది. 82 బంతుల్లో 66 రన్స్ చేసిన లిట్టన్‌ జడేజా బౌలింగ్‌లో గిల్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రహీమ్‌, మహ్ముదుల్లా రాణించడంతో బంగ్లాదేశ్‌ స్కోరు 200 మార్క్‌ను దాటింది. హాఫ్‌ సెంచరీవైపు ప్రయాణిస్తోన్న రహీమ్‌ 46 బంతుల్లో 38 రన్స్ చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరో మహ్ముదుల్లా వేగంగా రన్స్ చేయడంతో బంగ్లాదేశ్‌ 250 రన్స్ మార్క్‌ను దాటింది.

రోహిత్ ధనాధాన్‌.. కోహ్లీ కాలస్‌..:
257 రన్స్‌ టార్గెట్‌ ఛేజ్‌ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్‌ సూపర్బ్‌ స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ మెరుపు వేగంతో బ్యాటింగ్‌ చేశాడు. అటు రోహిత్‌కి గిల్ అద్భుతమైన సహకారం అందించాడు. 40 బంతుల్లో 48 రన్స్ చేసిన రోహిత్ శర్మ సిక్స్‌ కొట్టే క్రమంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్‌ కూడా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోని అవుట్ అయ్యాడు. మరోవైపు కోహ్లీ తన క్లాస్‌ బ్యాటింగ్‌ చూపించాడు. సింగిల్స్‌ రోటేట్ చేస్తూ.. వీలు దొరికినప్పుడల్లా సిక్స్‌ లేదా ఫోర్‌ బాదుతూ 50 పూర్తి చేసుకున్నాడు. అటు శ్రేయర్‌ అయ్యారు మెహీది హసన్‌కి బోల్తా పడ్డాడు. తర్వాత కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు దిగగా అతను కోహ్లీకి మంచి సపోర్ట్ ఇచ్చాడు. అటు కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అన్న అనుమానంలో ఫ్యాన్స్‌ ఉండగా.. చివరిలో కోహ్లీ రాహుల్‌కి స్ట్రైక్‌ ఇవ్వకుండా మొత్తం బంతులు తానే ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకోని మ్యాచ్‌ని గెలిపించాడు.

Also Read: Virat Kohli: బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ కింగే.. ఈ లెక్కలే సాక్ష్యం బ్రదరూ..! - Rtvlive.com

#virat-kohli #icc-world-cup-2023 #india-vs-bangladesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe