Virat Kohli: కోహ్లీ సెంచరీకి అంపైర్ హెల్ప్ చేశాడా? విరాట్‌ సెల్‌ఫిష్‌ బ్యాటింగ్‌ చేశాడా?

బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో విరాట్‌ వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేయగా.. కోహ్లీ బ్యాటింగ్‌ తీరుపై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సెంచరీ కోసం సింగిల్స్‌ తియ్యకపోవడం.. ఓవర్‌ చివరి బంతిని సింగిల్‌ తియ్యడంపై ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌ బౌలర్‌ వైడ్‌ వేసినా అంపైర్ వైడ్‌ ఇవ్వలేదని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Virat Kohli: కోహ్లీ సెంచరీకి అంపైర్ హెల్ప్ చేశాడా? విరాట్‌ సెల్‌ఫిష్‌ బ్యాటింగ్‌ చేశాడా?
New Update

వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీ బాదాడు. 97 బంతుల్లో 103 రన్స్ చేసిన కోహ్లీ వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో రెండు సెంచరీలు చేస్తే వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ నిలుస్తాడు. వన్డేల్లో 49 సెంచరీలతో సచిన్‌ టాప్‌లో ఉన్నాడు. క్రికెట్‌గాడ్ రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేయడానికి ఎక్కువ రోజులులేవని తెలుస్తోంది. ప్రస్తుతం కోహ్లీ ఫామ్‌ అలా ఉంది మరి. అయితే నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌పై ఓపైవు నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. కోహ్లీ సెంచరీ కోసమే ఆడాటంటూ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతోంది.

నిజానికి ఈ ట్వీట్లలో నిజం ఉన్నట్టుగానే భావించాలంటున్నారు పలువురు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌. మ్యాచ్‌ చూసిన ఎవరికైనా కోహ్లీ సెంచరీ కోసమే ఆడినట్టు క్లియర్‌గా అర్థమవుతోంది. అవతలి ఎండ్‌లో ఉన్న రాహుల్‌కి అసలు స్ట్రైక్‌ ఇవ్వకుండా కోహ్లీ తన సెంచరీ కోసమే ఆడినట్టు మ్యాచ్‌ చూస్తే తెలిసిపోతుందంటున్నారు కొందరు క్రికెట్‌ ఫ్యాన్స్. బాల్ బౌండరీ వరకు వెళ్లినా కోహ్లీ సింగిల్ కూడా తియ్యలేదని.. ఓవర్‌లో లాస్ట్ బాల్‌ని మాత్రం సింగిల్‌ తీశాడని.. ఇది గల్లి లెవల్లో ఆడే ప్లేయర్ల మైండ్‌సెట్‌గా ఉందని ట్వీట్లు పెట్టారు. అదే సమయంలో విజయానికి రెండు పరుగులు కావాల్సి ఉండగా బంగ్లాదేశ్‌ బౌలర్‌ క్లీయర్‌ వైడ్‌ వేశాడు. అయినా కూడా అంపైర్‌ వైడ్‌ ఇవ్వలేదు. కోహ్లీ సెంచరీ కోసమే ఇదంతా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: అదే సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్ అయితే ఈ ప్రపంచకప్‌ మనదే బ్రదరూ!

#virat-kohli #icc-world-cup-2023 #india-vs-bangladesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe