వరల్డ్‌కప్(World cup)లో టీమిండియా మంచి దూకుడు మీద ఉంది. వరుసపెట్టి మూడు మ్యాచ్‌ల్లో విక్టరీ కొట్టింది. ఆస్ట్రేలియా, అఫ్ఘాన్, పాకిస్థాన్‌పై టీమిండియా పూర్తిస్థాయిలో డామినేషన్ ప్రదర్శించింది. తర్వాతి మ్యాచ్ బంగ్లాదేశ్(bangladesh)తో ఆడనుంది. పూణే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఈ నెల 19న జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ ప్రయోగం చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. పాక్‌పై మ్యాచ్‌ను మలుపు తిప్పి బాబర్ టీమ్‌ని 200లోపే ఆలౌట్ చేయడానికి కారణం అయిన టీమిండియా స్టార్ బౌలర్, యార్కర్ కింగ్ బుమ్రా(Bumrah) బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదని సమాచారం.
ఈ టైమ్‌లో రెస్ట్ అవసరమా?
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని టీమ్ మ్యానేజ్‌మెంట్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బుమ్రా స్థానంలో పేసర్ షమీని ఛాన్స్ ఇచ్చి పరీక్షించాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సిరాజ్ చివరి మ్యాచ్‌లో రాణించినా అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లో తేలిపోయాడు. బుమ్రా టీమిండియాకు అతి పెద్ద అసెట్. అలాంటి బుమ్రాకు ఇలాంటి సమయంలో రెస్ట్ ఇవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది. వరుస పెట్టి మూడు విజయాలు సాధించామన్న అలసత్వం ఏ మాత్రం మంచిది కాదని.. ఇది చివరికి జట్టు కూర్పును దెబ్బతీస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
బుమ్రాను ఆడించాల్సిందే:
ఒకవేళ షమీని ఆడించాలని భావిస్తే బుమ్రాకు బదులుగా సిరాజ్ లేదా శార్దుల్‌కు రెస్ట్ ఇస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు అశ్విన్‌ని బెంచ్‌కే పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం ఆస్ట్రేలియాపై పోరులోనే అశ్విన్ బరిలోకి దిగాడు. ఇక వరల్డ్‌కప్‌లో కీలక సమయాల్లో ప్రయోగాలు మంచివి కావని ఫ్యాన్స్ అంటున్నారు. అందులోనూ బంగ్లాదేశ్‌పై అసలు వద్దంటున్నారు. ఎందుకంటే ఇండియాకు బంగ్లాదేశ్ అనేక సార్లు షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు. ఇటివలి బంగ్లాదేశ్ మునపటిలా ఆశించిన స్థాయిలో ఆడడంలేదన్న నిజమే కావొచ్చు.. కానీ ఒక్క మ్యాచ్ అటు ఇటు అయితే టీమిండియా కాన్ఫిడెన్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో రిస్క్ వద్దన్నది ఫ్యాన్స్ ఆలోచన.
బంగ్లాదేశ్‌పై భారత్ ప్లేయింగ్ XI(అంచనా): శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (C), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
ALSO READ: క్రికెట్ చూడడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఎవరైనా అడిగితే ఈ విషయాలు చెప్పండి!