Security Breach: మోదీ స్టేడియంలో భద్రతా ఉల్లంఘన.. కోహ్లీపై దూసుకొచ్చిన పాలస్తీనా సపోర్టర్!

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్ ధరించిన జాన్‌ అనే ఆస్ట్రేలియన్‌ పిచ్‌ మధ్యలోకి దూసుకొచ్చాడు. కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. అతడిని అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Security Breach:  మోదీ స్టేడియంలో భద్రతా ఉల్లంఘన.. కోహ్లీపై దూసుకొచ్చిన పాలస్తీనా సపోర్టర్!
New Update

ICC WORLD CUP 2023 FINAL: పేరుకేమో ప్రపంచంలో అతి పెద్ద సీటింగ్‌ కెపాసిటీ ఉన్న స్టేడియం. జరుగుతున్నది క్రికెట్‌లో అతి పెద్ద ఈవెంట్‌. వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు భారీ స్థాయిలో భద్రతాను ఏర్పాటు చేసింది గుజరాత్‌ ప్రభుత్వం. అహ్మదాబాద్‌ మోదీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్‌ పోరుకు క్రికెట్ సెలబ్రెటీల నుంచి బడా రాజకీయ నాయకులు వరకు తరలివచ్చారు. సామాన్యులతో పాటు వీఐపీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధాని మోదీ కూడా వచ్చిన ఈ మ్యాచ్‌లో భద్రతా లోపం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మ్యాచ్‌ జరుగుతుంటే ఓ వ్యక్తి స్టేడియంలోకి దూసుకురావడం కలకలం రేపింది.


కోహ్లీ బ్యాటింగ్‌ సమయంలో:
13.3 ఓవర్లలో ఇండియా 93/3 వద్ద బ్యాటింగ్ చేస్తోంది. క్రీజులో కోహ్లీ, రాహుల్ ఉన్నారు. సడన్‌గా ఓ వ్యక్తి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. వైట్‌ టీ షర్ట్‌తో పాటు ఓ ఫ్లాగ్‌ పట్టుకోని గ్రౌండ్‌లోకి వచ్చాడు. వచ్చి రావడమే కోహ్లీ దగ్గరకు వెళ్లాడు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థంకాలేదు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది గ్రౌండ్‌లోకి వచ్చినా ఆ సంబంధిత వ్యక్తి మాత్రం కోహ్లీ భుజంపై చేయి వేశాడు. ఈ లోపే సిబ్బంది వచ్చి అతడిని పట్టుకుపోయారు. దుండుగుడు ఇలా సడన్‌ ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్‌ కొద్ది సేపు ఆగింది. కాసేపటికి రెజ్యూమ్‌ అయ్యింది.

publive-image కోహ్లీ మీద చెయ్యి వేసిన పాలస్తినా సపోర్టర్

publive-image జాన్

publive-image కోహ్లీ భుజంపై చెయ్యి వేసిన జాన్

publive-image జాన్ ను గ్రైండ్ ను పట్టుకెళ్తున్న సిబ్బంది

అరెస్ట్.. పాలస్తినా సపోర్టర్:

తర్వాత ఆ వ్యక్తిని అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిని ఆస్ట్రేలియాకు చెందిన జాన్‌గా గుర్తించాడు. విరాట్ కోహ్లీని కలవడానికి ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చానని.. తాను పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నానని చెప్పాడు. ఇక ఇదే వరల్డ్‌కప్‌లో బ్రిటన్‌కు చెందిన జార్వో 69 ఇండియా కిట్ ధరించి మైదానంలోకి వచ్చాడు. అతను కూడా విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లాడు. ఇలా వరుస పెట్టి గ్యాలరీలో నుంచి సామాన్యులు గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తుండడం టెన్షన్ పెడుతోంది. ఫైనల్‌ మ్యాచ్‌లోనూ భద్రతా లోపం ఉండడంపై అభిమానులు మండిపడుతున్నారు. అక్టోబరు 7న హమాస్ తీవ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక, భూదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో పాలస్తీనియన్లపై ముఖ్యంగా పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని అన్ని దేశాలు ఖండిస్తున్నాయి.

Also Read: పిన్ డ్రాప్‌ సైలెన్స్.. స్టేడియాన్ని ఆవహించిన నిశ్శబ్దం..!

WATCH:

#virat-kohli #cricket #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe