IND VS AUS: స్వింగ్‌ మాములుగా లేదు బాసూ.. ఆసీస్‌ను కంగారెత్తిస్తోన్న బుమ్రా, షమీ!

ఆస్ట్రేలియా, టీమిండియా ఫైనల్‌ రసవత్తరంగా మారింది. 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 16ఓవర్లు ముగిసే సమమానికి 87 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.

New Update
IND VS AUS: స్వింగ్‌ మాములుగా లేదు బాసూ.. ఆసీస్‌ను కంగారెత్తిస్తోన్న బుమ్రా, షమీ!

ICC WORLD CUP 2023 FINAL: బాల్‌ గిర్రున తిరుగుతోంది. స్వింగ్‌ మాములుగా వెయ్యడం లేదు. ఔట్ స్వింగ్, ఇన్‌ స్వింగ్‌తో భారత్ బౌలర్లు విజృంభిస్తున్నారు. బుమ్రా, షమీ విజృంభనతో ఆసీస్‌ బ్యాటర్లు డిఫెన్స్‌లో పడిపోయారు. ఇప్పటికే మూడు వికెట్లు సమర్పించుకున్నారు. అయితే ఆసీస్‌ బ్యాటర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇలానే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా హెడ్‌ను ఔట్‌ చేయడం అన్నిటికంటే ముఖ్యం.


241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి ఓవర్లలో 11 పరుగులు చేసింది. తొలి రెండు బంతులను మిస్‌ఫీల్డ్‌తోనే భారత్‌ బౌలింగ్‌ ఆరంభించింది. అయితే రెండో ఓవర్‌లో వార్నర్‌ స్లీప్‌లో దొరికిపోయాడు. సూపర్‌ ఫామ్‌లో షమీ బేసిన బంతిని అంచన వేయడంలో ఫెయిలైన వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. ఇక ఆ తర్వాత బుమ్రా మరింత చెలరేగి బౌలింగ్‌ వేశాడు. రెండో ఓవర్‌ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 28 పరుగులకు ఒక వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్‌లో కేవలం బుమ్రా ఒక్క పరుగే ఇచ్చాడు.


మూడు ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ 29/1 దగ్గర నిలిచింది. తర్వాత షమీ వేసిన 4వ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 5 ఓవర్‌లో బుమ్రా ఆస్ట్రేలియాకు బ్రేక్‌ ఇచ్చాడు? మార్ష్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక ఆ తర్వాత స్మిత్ కూడా ఔట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో LBWఅయ్యాడు. అయితే నిజానికి అది నాటౌట్ .. బట్ స్మిత్‌ మాత్రం రివ్యూ తీసుకోలేదు. అంపైర్ ఔట్ ఇచ్చాకా.. నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న హెడ్ వైపు చూశాడు స్మిత్. అటు హెడ్‌ అవుట్ అన్నట్టు సైగ చేశాడు. దీంతో స్మిత్‌ తలదించుకుని వెళ్లిపోయాడు.. రీప్లేలో మాత్రం స్మిత్‌ నాటౌట్‌ అని తేలింది.

Also Read:  భారతీయులు ప్రార్థిస్తున్నది ఇద్దర్నే.. ఒకరు బౌలర్లు, రెండోది దేవుడిని!

Advertisment
తాజా కథనాలు