IND vs PAK: రోహిత్ శర్మ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్ స్వరూపమే మరిపోయింది భయ్యా..నువ్వు కేక బ్రో! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన కెప్టెన్సీ ఎలాంటిదో ప్రపంచానికి చూపించాడు. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను తన తెలివితేటలతో కట్టడి చేశాడు. 29ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఉన్న పాక్ ఒక దశలో 300 రన్స్ చేసేలా కనిపించింది. అయితే సరిగ్గా అదే సమయంలో ఊహించని విధంగా బుమ్రాను రంగంలోకి దింపిన రోహిత్ సక్సెస్ అయ్యాడు. అప్పటికీ క్రీజులో పాతుకుపోయిన రిజ్వాన్‌ని అవుట్ చేశాడు. దీని తర్వాత మ్యాచ్ మలుపు తిరిగి పాక్ 192 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. By Trinath 14 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి కెప్టెన్ తీసుకునే నిర్ణయాలు మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి. కొన్నిసార్లు బోల్తా కొడతాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్స్‌పర్ట్. అందుకే ఐదు ఐపీఎల్ కప్‌లు సాధించాడు. ఇక వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌పై మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ తన మార్క్ కెప్టెన్సీ చూపించాడు. భారీ స్కోరు వైపుగా దూసుకెళ్తున్న పాక్ టీమ్‌ని తన బ్రెయిన్‌తో కట్టడి చేశాడు. రోహిత్ ఆ నిర్ణయం తీసుకోని ఉండకపోయి ఉంటే సీన్ వేరేల ఉండేదని అభిమానులు చెబుతున్నారు. వాటే ఐడియా: ఇండియాపై మ్యాచ్‌లో పాక్ జట్టుకు అదిరే ఆరంభం వచ్చింది. ఓపెనర్లు ఇద్దరూ నిలకడగా ఆడారు. సిరాజ్ ముందుగా బ్రేక్ ఇచ్చాడు. 24 బంతుల్లో 20 రన్స్ చేసిన అబ్దుల్లాను LBW చేశాడు. ఇక ఆ తర్వాత 6 బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించిన ఇమామ్ ఉల్ హక్‌ని హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. 38 బంతుల్లో 36 రన్స్ చేసిన ఇమామ్ కీపర్ రాహుల్ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిజ్వాన్‌తో కలిసి బాబర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టారు. ఈ ఇద్దరి జోడిని విడతీసేందుకు టీమిండియా బౌలర్లు చాలా కష్టపడ్డారు. ఇక రోహిత్ శర్మ తన బ్రెయిన్‌కి పదును పెట్టాడు. అప్పటికీ టీమ్ 155 రన్స్ దగ్గర ఉంది. 29 ఓవర్లు ముగిశాయి. మరో 21 ఓవర్లు మిగిలి ఉన్నాయి. అంటే 126 బాల్స్ ఉన్నాయి. కనీసం 150 రన్స్ చేసినా పాక్ 300 పరుగులు దాటుతుంది. అయితే అది జరగలేదు. ముందుగా సిరాజ్ బాబర్‌ని బోల్తా కొట్టించాడు. ఇక అప్పటికీ రిజ్వాన్ క్రీజులో పాతుకుపోయి ఉన్నాడు. పాకిస్థాన్‌కు అసలు ఛాన్స్ ఇవ్వకూడదని రోహిత్ డిసైడ్ అయ్యాడు. టీమిండియా తురుపు ముక్క బుమ్రాని బరిలోకి దింపాడు. బుమ్రా వచ్చి రావడంతోనే తన అస్త్రశస్త్రాలను ఉపయోగించాడు. దెబ్బకు రిజ్వాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అక్కడ నుంచి పాకిస్థాన్ అసలు కోలుకోలేదు. ఇంతలోనే బుమ్రా మరో వికెట్ తీశాడు. షాదాబ్ ఖాన్ వికెట్ తీశాడు. ఇక మధ్యలో ఇఫ్తికర్‌తో పాటు షకీల్‌ను కుల్దీప్ అవుట్ చేశాడు. ఇలా ఒకవైపు స్పిన్ మరోవైపు పేస్‌తో రోహిత్ పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. రోహిత్ బ్రెయిన్ దెబ్బకు పాక్ విలవిలలాడింది. 300 రన్స్ చేస్తుందనుకుంటే 192 రన్స్‌కి పరిమితం అయ్యింది. ALSO READ: క్రికెట్ చూడడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఎవరైనా అడిగితే ఈ విషయాలు చెప్పండి! #rohit-sharma #india-vs-pakistan #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి