IND Vs PAK: దోమను బ్యాట్‌తో బాదేసిన గిల్‌.. నువ్వు దేవుడివి సామీ.. ఇక ప్రత్యర్థులు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే!

టీమిండియా యువ ఓపెనర్‌ శుభమన్‌ గిల్ పాక్‌తో మ్యాచ్‌కు బరిలోకి దిగాడు. డెంగీ నుంచి త్వరగా కోలుకున్న గిల్‌ సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. గిల్‌కు వరల్డ్‌కప్‌లో ఇది తొలి మ్యాచ్‌. ఇక టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.

IND Vs PAK: దోమను బ్యాట్‌తో బాదేసిన గిల్‌.. నువ్వు దేవుడివి సామీ.. ఇక ప్రత్యర్థులు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే!
New Update

Shubman Gill Returns- World Cup 2023: ఫస్ట్ జ్వరం వచ్చిందన్నారు.. అయ్యో.. ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఆడుతాడో లేదో అని ఫ్యాన్స్‌ ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ లోపే జ్వరం ఇంకా తగ్గలేదని.. బ్లడ్‌ టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారన్నారు.. టెస్ట్ చేసి రిపోర్ట్ చూశారు. డెంగీ పాజిటివ్‌గా తేలింది. టీమిండియా యంగ్‌ గన్‌ గిల్(Shubman Gill) కు సరిగ్గా గత శుక్రవారం డెంగీ పాజిటివ్‌గా తేలింది. ఆదివారం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సమయంలో గిల్ చెన్నై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్లేట్‌లెట్ కౌంట్‌ పడిపోయి ఉంది. దీంతో మరో వారం పది రోజులు గిల్ గ్రౌండ్‌లో దిగే ఛాన్స్ లేదని అంతా డిసైడ్ ఐపోయారు.

బుధవారం అఫ్ఘాన్‌తో మ్యాచ్‌ ఆడింది టీమిండియా. ఢిల్లీ అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు అంటే మంగళవారం గిల్‌ చెన్నై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ రోజు, తర్వాతి రోజు బీసీసీఐ (BCCI) వైద్య బృందం ప్రత్యేక పర్యవేక్షణలో గడిపాడు. ఇక బుధవారం అర్థరాత్రి సమయంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి చేరుకున్నాడు గిల్. ఇది చూసి అక్కడున్న వారు షాక్‌ అయ్యారు. మాస్క్ పెట్టుకోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు బయటకు వచ్చిన గిల్‌ని తమ కెమెరాల్లో బంధించారు ఫ్యాన్స్. కారు ఎక్కి హోటల్‌ రూమ్‌కి వెళ్లిపోయాడు గిల్. అయినా కూడా పాక్‌తో (Ind vs Pak) మ్యాచ్‌కు తుది జట్టులో ఉంటాడని ఎవరూ కూడా భావించలేదు. ఎందుకంటే డెంగీ అంటే చన్న విషయం కాదు.

నువ్వు మాములోడివి కాదు బాసూ:
ఎవరూ ఊహించని విధంగా గిల్‌ నిన్న ప్రాక్టీస్‌ సేషన్‌కు వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇక గిల్ పాక్‌తో మ్యాచ్‌కు ఆడుతాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిన్న సాయంత్రం రోహిత్ శర్మ ప్రెస్‌ మీటింగ్‌లో గిల్‌ హెల్త్‌పై క్లారిటీ ఇచ్చాడు. డెంగీ నుంచి గిల్ కోలుకున్నాడని.. 99శాతం పాక్‌తో మ్యాచ్‌కు బరిలోకి దిగుతాడని చెప్పారు. రోహిత్ చెప్పింది నిజం అయ్యింది. గిల్‌ తుది జట్టులోకి వచ్చేశాడు. డెంగీని ఇంత త్వరగా బీట్ చేసిన గిల్‌కు అభిమానులు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. ఈ ఏడాది గిల్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఏడాది కాలంగా గిల్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా సొంత గడ్డపై చెలరేగిపోతున్నాడు. వన్డేల్లో ఏకంగా సచిన్‌ రికార్డులకే ఎసరు పెట్టేలా కనిపించాడు. 20 వన్డేల్లో 1,230 రన్స్‌ చేశాడు. యావరేజ్‌ కూడా 72.35గా ఉంది. గిల్‌ ఏకంగా ఈ ఏడాది ఐదు సెంచరీలు బాదాడు. వీటిలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.

ALSO READ: మాయదారి దోమలు.. డెంగీ బారిన పడ్డ లెజెండ్‌.. పాక్‌తో మ్యాచ్‌కు దూరం..!

#shubman-gill #india-vs-pakistan #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe