IND Vs PAK: టాస్‌ మనదే.. ఫస్ట్ బ్యాటింగ్‌ ఎవరిదంటే..? ఇండియా, పాక్‌ తుది జట్లు ఇవే!

వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్‌ పోరుకు టాస్‌ పడింది.. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.

New Update
IND Vs PAK: టాస్‌ మనదే.. ఫస్ట్ బ్యాటింగ్‌ ఎవరిదంటే..? ఇండియా, పాక్‌ తుది జట్లు ఇవే!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్‌ పోరుకు టాస్‌ పడింది.. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక ప్రపంచకప్ లో భారత్-పాక్ ఇప్పటికి ఏడు సార్లు తలపడ్డాయి. ఇది 8వ సారి. ఇప్పటివరకు పాకిస్తాన్ (Pakistan) జట్టును ఒక్క మ్యాచ్ గెలవనివ్వలేదు టీమ్ ఇండియా (Team India). ఈసారి కూడా ఈ రికార్డ్ ను రోహిత్ సేన నిలబెడుతుందా లేదా అనే చూడాలి. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుంది.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.

గిల్ ఇన్:

డెంగీని తన్నితరిమేసిన యువ ఓపెనర్ గిల్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఇవాళ్టి మ్యాచ్‌కు 99శాతం అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ నిన్ననే క్లారిటీ ఇచ్చాడు. దీంతో గత రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్‌ కిషన్‌ ఇవాళ్టి మ్యాచ్‌కు లేడు. ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో నిర్లక్ష్యపు షాట్ ఆడి అవుటైన శ్రేయర్‌ అయ్యర్‌ మాత్రం టీమ్‌లో ఉన్నాడు. గిల్ తుది జట్టులోకి రావడంతో ఎప్పటిలాగే రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ దిగుతాడు. ఇక వన్‌ డౌన్‌ స్పెషాలిస్ట్ బ్యాటర్‌, టీమిండియా ఛేజ్‌ కింగ్‌ కోహ్లీ తన స్థానంలో దుమ్మురేపేందుకు రెడీ అవుతున్నాడు. ఇక నాలుగో నంబర్‌లో రాహుల్‌ లేదా అయ్యార్‌ బ్యాటింగ్‌కి వచ్చే ఛాన్స్ ఉంది.

ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఇవాళ్టి మ్యాచ్‌లో కూడా అశ్విన్‌, జడేజా, కుల్దీప్ యాదవ్‌తో పాక్‌ బ్యాటర్లకు చెక్‌ పెట్టేందుకు రోహిత్‌ స్కెచ్‌ వేసినట్టుగా అంతా భావించారు. అయితే అఫ్ఘాన్‌పై యూజ్ చేసిన ఫార్ములానే ఉపయోగించాలని ఫైనల్‌గా డిసైడ్ అయ్యాడు రోహిత్ శర్మ. అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లో అశ్విన్‌కి రెస్ట్ ఇచ్చి శార్దుల్‌ని తీసుకున్నారు. ఇవాళ్టి పాక్‌పై మ్యాచ్‌లోనూ అదే ఫార్ములానని ఉపయోగించునుంది టీమిండియా పేసర్లుగా బుమ్రా, సిరాజ్‌, శార్దుల్ ఉన్నారు. కుల్దీప్‌, జడేజా స్పిన్నర్లగా ఉన్నారు. ఇక లాస్ట్ మ్యాచ్‌లో సిరాజ్‌ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడా అన్నది చూడాల్సి ఉంది.

ALSO READ: 2028 నుంచి ఒలింపిక్స్‌ లో క్రికెట్‌: ఐఓసీ!

Advertisment
తాజా కథనాలు