IND VS NZ: వన్డేల్లో 50వ సెంచరీ చేసిన కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. కేవలం 279 ఇన్నింగ్స్‌లోనే కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. సచిన్ వన్డేల్లో 452 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు చేశాడు. ఇప్పుడా రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. అయితే కోహ్లీ ఖాతాలో మరో యూనిక్ రికార్డు వచ్చి చేరింది. వన్డే ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్, టీ20 వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్, ఐపీఎల్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఈ వరల్డ్‌కప్‌లో 700కు పైగా రన్స్ చేసిన కోహ్లీ 20ఏళ్ల నాటి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. 2003 ఎడిషన్‌లో సచిన్ 673 రన్స్ చేయగా.. ఇప్పుడా రికార్డు గల్లంతయ్యింది. అటు 2014 టీ20 వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో కోహ్లీ 319 రన్స్ చేశాడు. ఆ వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇండియా ఓడిపోయింది. ఇక 2016 ఐపీఎల్‌లో కోహ్లీ ఒకే సిజన్‌లో 973 రన్స్ చేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ ప్లేయర్ కూడా ఇన్ని పరుగులు చేయలేదు. ఇలా వన్డే, టీ20 ప్రపంపకప్‌లతో పాటు ఐపీఎల్ సింగిల్ ఎడిషన్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఇక ఇవే కాకుండా కోహ్లీ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి పడ్డాయి
ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో భారత్‌కు అత్యధిక స్కోరు
117 - విరాట్ వర్సెస్ కివీస్
111* - సౌరవ్ గంగూలీ వర్సెస్ కెన్యా
105 - అయ్యర్ వర్సెస్ న్యూజిలాండ్
85 - సచిన్ టెండూల్కర్ వర్సెస్ పాకిస్థాన్
83 - సచిన్ టెండూల్కర్ వర్సెస్ కెన్యా
80* - గిల్ వర్సెస్ కివీస్
77 - రవీంద్ర జడేజా వర్సెస్ కివీస్
65 - సచిన్ టెండూల్కర్ వర్సెస్ శ్రీలంక
65 - ధోని వర్సెస్ ఆస్ట్రేలియా
Also Read: సచిన్‌కు సెల్యూట్ చేసిన కోహ్లీ, అనుష్కకు ఫ్లయింగ్ కిస్..! ట్విట్టర్ రియాక్షన్ ఇదే!