ICC WORLD CUP 2023: వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ తన భయంకర ఫామ్‌ని సెమీస్‌లోనూ కంటీన్యూ చేశాడు. దిగిందే మొదలు బాది పడేశాడు. గిల్‌ను ఓ ఎండ్‌లో పెట్టి కివీస్ బౌలర్లపై దాడి చేశాడు. ఎంతో అలవోకగా సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలోనే అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఇండియాకు రోహిత్ సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులు కొట్టిన రోహిత్ 47 రన్స్ దగ్గర ఔట్ అయ్యాడు. సిక్స్‌కు యత్నించి కెప్టెన్ విలియన్‌సన్ చేతికి చిక్కాడు. 29 బాల్స్‌లోనే 47 రన్స్ చేశాడు రోహిత్. ఈ క్రమంలో రోహిత్‌కు సంబంధించిన కొన్ని లెక్కలపై ఓ లుక్ వెయ్యండి.
ఫస్ట్ ఓవర్లలో టాప్:
తొలి పది ఓవర్లలో రోహిత్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. రోహిత్ వేగంగా ఆడుతుండడంతో మిగిలిన ప్లేయర్లు స్లో అండ్ స్టడిగా రన్స్ చేస్తున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో తొలి 10 ఓవర్లలో రోహిత్ 354 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 133గా ఉంది. అదే సమయంలో మిగిలిన ప్లేయర్లందరూ కలిసి 300 రన్స్ చేశారు. వారి స్ట్రైక్ రేట్ 89.82గా ఉంది.
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ కొట్టిన సిక్సర్లతో మరో రికార్డు రోమిత్ ఖాతాలో పడింది. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ తన మూడో సిక్స్ కొట్టడం ద్వారా వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లో రోహిత్ పేరిట 50 సిక్సర్లు ఉన్నాయి. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (49 సిక్సర్లు) రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్‌కి ఇది మూడో ప్రపంచకప్. దీనికి ముందు, అతను 2015 – 2019 ODI ప్రపంచకప్‌లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
Also Read: ఆ ఘనత సాధించిన మూడోవాడిగా కొహ్లీ.. కివీస్ ను ఆడేసుకుంటున్న భారత్