/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/shami-3-jpg.webp)
ICC WORLD CUP 2023: వాంఖడే పిచ్‌పై గొప్పగా బ్యాటింగ్ చేయడం పెద్ద విశేషం ఏమీ కాదు.. సెంచరీలు బాదడం, బౌలర్లను చీల్చిచెండడం ఫ్యాన్స్‌కు గొప్పగా అనిపించినా అది సాధారణ విషయమే.. నిజానికి ఈ వరల్డ్‌కప్‌లో దాదాపు ప్రతీ మ్యాచ్ బ్యాటింగ్ ట్రాక్‌పైనే జరిగింది. అన్నీ బ్యాటింగ్ ట్రాక్‌లపైనా మిగిలిన జట్ల బౌలర్లు భయంకరంగా పరుగులు సమర్పించుకుంటే ఇండియా మాత్రం బౌలింగ్‌లోనూ దుమ్ములేపింది. ముఖ్యంగా స్టార్ పేసర్ మహ్మాద్ షమీ(Mohammed shami) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఉంటుంది. షమీ ఎంత గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడో చెప్పాలంటే మాటలు సరిపోవు.. రాతలు చాలవు.. గణాంకాలతో చెప్పినా అది తక్కువే అవుతుంది. సెమీస్‌లో కివీస్‌పై భారత్ 70 పరుగులతో విజయం సాధించిందంటే అది షమీ వల్లే. బ్యాటింగ్ మోజుతో బతికే భారతీయులకు షమీ తన బంతితోనే సమాధానం చెప్పాడు. ఏడు వికెట్లతో వన్డేల్లో భారత్ తరుఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
🔥 First to take 7 wickets for India in an ODI
🔥 First to take 7 wickets in an ODI World Cup knockoutMOHAMMED SHAMI IS BOWLING ON ANOTHER LEVEL! https://t.co/ptgFIHUKpk | #INDvNZ | #CWC23 pic.twitter.com/moozt8kCz8
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2023
ఎన్నెన్ని రికార్డులు..
భారత్ తరుఫున వన్డేల్లో అత్యుత్తుమ గణాంకాలు నమోదు చేసిన షమీ.. సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్‌గా నిలిచాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సార్లు ఒక్కటే ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన బౌలర్ షమీ. ఈ ఒక్క వరల్డ్‌కప్‌లోనే షమీ మూడు సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్‌కప్‌ల్లో వేగంగా 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా షమీ సరి కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో 17 ఇన్నింగ్స్‌లో నాలుగు సార్లు ఐదు వికెట్లు కూల్చాడు షమీ. ఐసీసీ ఈవెంట్లలో ఇదే అత్యుత్తుమం. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మూడు సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. ఈ వరల్డ్‌కప్‌లో షమీ బౌలింగ్ యావరేజ్ 9.56. అంటే సుమారు ప్రతి 10 బంతులకు ఒక వికెట్ తీశాడు.
What a Shami-final!!!!!!
Well done India for a superb batting display and a spectacular bowling performance to get into the final. 😊😊😊#INDvNZ pic.twitter.com/XtqZWQvcJT— Sachin Tendulkar (@sachin_rt) November 15, 2023
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ల్లోనూ టాప్:
ఈ వరల్డ్ కప్‌లో షమీకి మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌లపై షమీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకుంటున్నాడంటే అతనిలో పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఐసీసీ నాకౌట్లలో ఓ భారతీయ బౌలర్ ఫైఫర్(ఒక్కటే మ్యాచ్‌లో 5 వికెట్లు) తియ్యడం ఇదే తొలిసారి. కివీస్‌పై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో కలిపి ఈ ఏడాది మొత్తంగ 5సార్లు ఈ అవార్డు అందుకున్నాడు. ఇక ప్రపంచకప్ హిస్టరీలో నాలుగు సార్లు ప్లేయర్ ఆప్ ది అవార్డు అందుకున్న బౌలర్ షమీ.. అందులో మూడు సార్లు ఈ వరల్డ్‌కప్‌లోనే ఉన్నాయంటే షమీ ఫామ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. ఇక వన్డే హిస్టరీలో ఇప్పటివరకు 9సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న షమీ.. ఇందులో 5సార్లు న్యూజిలాండ్‌పై వికెట్లు పడగొట్టి అందుకోవడం విశేషం
Also Read: చెల్లుకు చెల్లు.. దెబ్బకు దెబ్బ.. ఫైనల్‌కి దూసుకెళ్లిన టీమిండియా!