క్రికెట్ అభిమానులకు మంచి మజాను పంచింది సెమీస్ మ్యాచ్. కివీస్, టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలుపుతో రోహిత్ సేన ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఇక నవంబర్ 16న ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ రెండో సెమీస్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఇండియా తలపడనుంది. నవంబర్ 19(ఆదివారం) అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలుపుతో 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. 2019 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలోనే ఇండియా ఓడిపోయిన విషయం తెలిసింది. స్టార్ పేసర్ షమీ మరోసారి భారత్‌ను గెలిపించాడు. బంతితో నిప్పులు చెరిగాడు. ఏడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో ప్రపంచ కప్ హిస్టరీలో నాలుగో సారి ఫైనల్ కు చేరిన జట్టుగా ఇండియా నిలిచింది.
కోహ్లీ, అయ్యర్ షో:
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ , గిల్ అదిరే స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. సిక్సులు, ఫోర్లతో వేగంగా రన్స్ చేశాడు. రోహిత్ దూకుడుతో 6 ఓవర్ల ముగిసేలోపే భారత్ 50 రన్స్ దాటింది. ఎక్కడా తగ్గకుండా రోహిత్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీవైపు కదులుతున్న రోహిత్ కేన్ విలియమ్‌సన్ అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్‌కు చేరాడు. 29 బంతుల్లో రోహిత్ 47 రన్స్ చేశాడు. ఆ తర్వాత గిల్ కూడా మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 66 బంతుల్లో 80 రన్స్ చేసిన గిల్‌కు క్రాంప్స్ ఇష్యూ రావడంతో గ్రౌండ్‌ను వీడాడు. 52ఏళ్ల వన్డే చరిత్రలో ఎవరికి సాధ్యం కానీ రికార్డును కోహ్లీ సాధించాడు. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. 113 బంతుల్లో 117 రన్స్ చేసిన కోహ్లీ సౌథికి ఔట్ అయ్యాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మరో ఎండ్‌లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 70 బంతుల్లో 105 రన్స్ చేసిన అయ్యర్ బౌల్ట్‌కి చిక్కాడు. అయ్యర్ ఇన్నింగ్స్‌లో 8 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. చివరిలో రాహుల్ కివీస్ బౌలర్లను ఉతికేశాడు. 20 బంతుల్లో 39 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. అందరూ తలో చెయ్యి వేయడంతో ఇండియా 50 ఓవర్లలో ఏకంగా 397 రన్స్ చేసింది.
మిచెల్ సెంచరీ.. షమీ నిప్పులు:
లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన కివీస్ ఆదిలోనే కష్టాల్లో పడింది. ఓపెనర్లు వికెట్లను త్వరగా కోల్పోయింది. 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను విలియమసన్, డారిల్ మిచెల్ ఆదుకున్నారు. ఇద్దరూ ఎంతో జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలనే ఇద్దరూ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్ఖు 181 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. ఈ క్రమంలోనే బౌలింగ్‌కు వచ్చిన షమీ విలియమ్‌సన్‌ని పెవిలియన్‌కు పంపించాడు. 73 బంతుల్లో విలియమ్‌సన్ 69 రన్స్ చేశాడు. అటు టామ్ లాథమ్ వచ్చి రావడంతోనే ఔట్ అయ్యాడు. అయితే మరో ఎండ్‌లో డారిల్‌మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీతో కదంతొక్కాడు. అయితే షమీ నిప్పులు చెరగడండో అంతా పెవిలియన్‌కు చేరుకున్నారు. చివరకు భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read: నా పాదాలు కాదు.. నా హృదయాన్ని టచ్ చేశావ్.. కోహ్లీ సెంచరీపై సచిన్ ఎమోషనల్!