/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kohlii-1-jpg.webp)
IND vs NED: విరాట్ కోహ్లీ(Virat Kohli) అభిమానులను నిరాశపరిచాడు. 50కొట్టినా.. 100 కొట్టలేకపోవడంతో ఫ్యాన్స్ అన్‌హ్యాపీగా ఉన్నారు. ఎంతకైనా కోహ్లీ స్టాండర్డ్ అంటే సెంచరీనే కదా. క్రికెట్‌లో హాఫ్ సెంచరీ చేసినా ఫ్యాన్స్ ఖుషీ అవ్వని ప్లేయర్ విరాట్ కోహ్లీనే కావొచ్చు. ఇప్పటికే 49 వన్డే సెంచరీలతో సచిన్ రికార్డును సమం చేసిన ఈ రన్ మెషీన్ మరో సెంచరీ చేస్తే 50 మార్క్ టచ్ అవుతుంది. నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధిస్తాడని అంతా అనుకున్నారు. మ్యాచ్ జరుగుతుంది కూడా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కావడం, బౌండరీ లెంగ్త్ చిన్నగా ఉండడం, ప్రత్యర్థి పసికూన కావడం, కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో సెంచరీ పక్కా అని అందరూ ఫిక్స్ ఐపోయారు. అయితే కోహ్లీ మాత్రం తన సెంచరీని సెమీస్ వరకు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
Virat Kohli bowled 💔 pic.twitter.com/jPrW0xZZ8b
— Nietzsche Jain (@aayanonly) November 12, 2023
అయ్యో.. క్లీన్ బౌల్డ్:
నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీకి ఇది వన్డేల్లో 71వ సెంచరీ. 56 బంతుల్లో 51 రన్స్ చేసిన కోహ్లీ వాన్ డెర్వ్‌మెర్వ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 5ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. నిజానికి పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలిస్తోంది. ఓపెనర్లు గిల్, రోహిత్ సైతం అర్థసెంచరీలు చేశారు. ముఖ్యంగా గిల్ రఫ్పాడించాడు. 30 బాల్స్‌లో 50రన్స్ చేశాడు. గిల్ ఖాతాలో 4 సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. అటు రోహిత్ శర్మ మరోసారి సత్తా చాటాడు. ఈ వరల్డ్‌కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్ మరో సారి ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాడు. 54 బంతుల్లో 61 రన్స్ చేసిన రోహిత్ లీడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Virat Kohli
Vs NederlandsBowled in 2011 World Cup
Bowled In 2023 World Cup #ViratKohli #INDvNED
— AnuP MaHapatrA🇮🇳 (@am_i_anup) November 12, 2023
ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయర్ అయ్యార్‌తో కలిసి విరాట్ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నా.. వెంటనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరంది. సింగిల్ ఎడిషన్ వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు 50+ రన్స్ చేసిన లిస్ట్‌లో కోహ్లీ మరోసారి సచిన్‌తో సమానంగా నిలిచాడు. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీకి ఇది 7వ 50+ స్కోర్. 2003 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో సచిన్ కూడా ఏడు సార్లు 50+ రన్స్ చేశాడు. ఇక ఈ లిస్ట్‌లో షకీబ్ అల్ హసన్ కూడా ఉన్నాడు.
Also Read: రోహిత్ శర్మ దెబ్బకు కోహ్లీ ఫ్రెండ్ రికార్డు గల్లంతు.. సూపర్ ‘హిట్’మ్యాన్..!
WATCH: