Rohit Sharma: 'తమ్ముడు.. పక్కకెళ్లి ఆడుకో..మా పరువు తియ్యకు..' తలకొట్టుకున్న లెజెండరీ ప్లేయర్!

టాస్ గెలవడం కాయిన్‌ను ప్రతిసారీ రోహిత్ దూరంగా పడేలా విసిరేశాడన్నా పాక్‌ మాజీ ప్లేయర్‌ సికిందర్‌ బఖ్త్‌ వ్యాఖ్యలపై లెజెండరీ క్రికెటర్‌ వసీం అక్రమ్ ఫైర్ అయ్యాడు. ఇలాంటి కామెంట్స్‌పై రియాక్ట్‌ అవ్వడానికి కూడా తాను ఇష్టపడనంటూ మండిపడ్డాడు.

Rohit Sharma: 'తమ్ముడు.. పక్కకెళ్లి ఆడుకో..మా పరువు తియ్యకు..' తలకొట్టుకున్న లెజెండరీ ప్లేయర్!
New Update

ICC WORLD CUP 2023: ఇంతకంటే ఘోరంగా ఎవరూ ఏడవరు.. పక్కొడు ఏదైనా సాధిస్తుంటే తట్టుకోలేని ప్రపంచం ఇది. తట్టులేకపోవడం, ఓర్వలేకపోవడం సర్వసాధారణమే అనుకుందాం. కానీ లిమిట్‌ దాటేసి అడ్డదిడ్డంగా, అడ్డగొలుగా వాగితే చికాకు పుడుతుంది. చిర్రెత్తుకొస్తోంది. ఇలా ప్రవర్తిస్తే సొంత జట్టు ప్లేయర్‌నైనా, సొంతం అనుకున్న మనిషినైనా తిట్టాలనిపిస్తుంది. వరల్డ్‌కప్‌లో ఇండియా సాధిస్తున్న విజయాలను చూసి పాకిస్థాన్‌కు చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు. ప్రపంచం ముందు నవ్వులపాలవుతున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ(Rohit Sharma) టాస్‌ గెలవడం పట్ల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సికందర్ బఖ్త్ విచిత్రమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. బఖ్త్‌ కామెంట్స్‌పై పాక్‌ లెజెండరీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌(Wasim Akram) తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. సొంత జట్టు సహచర ప్లేయర్లకు చివాట్లు పెట్టాడు.


నేనం మాట్లాడలేను:
'అసలేం మాట్లాడుతున్నావ్‌రా.. నరాలు కట్ ఐపోతున్నాయ్' అన్నది సినిమా డైలాగ్‌.. అదే డైలాగ్‌ తెలుగులో చెప్పలేదు కానీ.. వసీం అక్రమ్‌ చెప్పాలనుకున్నది కూడా ఈ డైలాగే. రోహిత్ శర్మ టాస్‌ వేసేటప్పుడు కాయిన్ దూరంగా వేస్తున్నాడని.. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అంత దూరం నడవడం లేడని.. అక్కడ టాస్‌ ఎవరు గెలిచారో రోహిత్‌కి మాత్రమే తెలుస్తుందంటూ వింత వ్యాఖ్యలు చేశాడు బఖ్త్‌. అతను సీరియస్‌గా చేసినా ఈ వ్యాఖ్యలు మాత్రం కామెడీగా పేలాయి. అదే సమయంలో పాక్ మాజీ ఆటగాళ్లకు మాత్రం బఖ్త్‌పై ఒళ్లు మండింది. 'నాణెం ఎక్కడ పడాలో ఎవరు నిర్ణయిస్తారు? మ్యాట్‌ కేవలం స్పాన్సర్‌షిప్ కోసం.. ఇలాంటి కామెంట్స్‌పై రియాక్ట్‌ అవ్వడానికి కూడా ఇష్టపడను' అని ఘాటు విమర్శలు చేశారు.


ఇక సైలెంట్‌గా ఉండండి:
వసీం అక్రమ్‌తో పాటు షోయబ్‌ మాలిక్‌ సైతం బఖ్త్‌ వ్యాఖ్యలను ఖండించాడు. కాయిన్‌ టాస్‌ గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు.. అని ముఖం నిరాశగా పెట్టి.. మాలిక్‌ బఖ్త్‌ను విమర్శించాడు. ఇక ప్రతి కెప్టెన్ నాణెం విసిరే విధానం ఒక్కో విధంగా ఉంటుందని పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ మొయిన్ అభిప్రాయపడ్డాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో ఇండియా గెలుపులను తొలి నుంచి జీర్ణించుకోలేకపోతున్న పాక్‌లోని కొంతమంది మాజీ ఆటగాళ్లు ఇప్పటికే పలుసార్లు వింత, విడ్డూర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా బౌలింగ్‌ సమయంలో వారికి ఐసీసీ సపరేట్ బాల్స్ ఇస్తుందని.. పిచ్‌ కూడా మారుస్తుందంటూ కామెడీ పండించారు.

Also Read: ఆస్ట్రేలియా పాలిట యముడు, సిక్సర్ల వీరుడు.. ఈ సారి చితక్కొట్టేది ఎవరో..!

WATCH:

#wasim-akram #rohit-sharma #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి