Ind vs Pak: ఈ టీమిండియా మొనగాడు వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..!

డెంగీ బారిన పడ్డ టీమిండియా యువ సంచలనం శుభమన్‌ గిల్‌ చెన్నై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. అయితే ప్రస్తుతం అతని ప్లేట్‌లెట్‌ కౌంట్ తక్కువగా ఉందని తెలుస్తోంది. భారత్‌ జట్టుతో పాటు హోటల్‌లోనే గిల్ ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో గిల్‌ ఉన్నట్టు తెలుస్తోంది. రేపు(అక్టోబర్‌ 11) అప్ఘాన్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడంలేదు. అటు అక్టోబర్‌ 14న పాక్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్‌ ఆడడంపైనా సందేహాలు రేకెత్తుతున్నాయి.

New Update
Ind vs Pak: ఈ టీమిండియా మొనగాడు వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..!

వరల్డ్‌కప్‌(world cup)లో భాగంగా రేపు(అక్టోబర్ 21) టీమిండియా అఫ్ఘానిస్థాన్‌(Afghanisthan)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌ ఐనప్పటికీ అఫ్ఘాన్‌ని తక్కువ అంచనా వేస్తే బొక్క బోర్లా పడడం ఖాయం. అందుకే ఎలాంటి అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక రేపటి మ్యాచ్‌కు కూడా యువ ఓపెనర్‌ గిల్ అందుబాటులో ఉండడం లేదు. డెంగీ(Dengue) కారణంగా గిల్‌(Gill) అఫ్ఘాన్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. నిన్నటివరకు చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న గిల్‌ తాజాగా హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ ఐనట్టు సమాచారం. అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీకి వెళ్లే ముందు గిల్ ప్లేట్‌లెట్ కౌంట్‌ను చెక్‌ చేశారు. అయితే ప్లేట్‌లెట్‌ కౌంట్‌ చాలా తక్కువగా ఉందని అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

publive-image గిల్ (image source/AFP)

పాక్‌తో మ్యాచ్‌కు ఉంటాడా?
అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో గిల్ స్థానంలో ఇషాన్‌ కిషాన్‌ ఆడుతాడు. రోహిత్‌ కలిసి ఓపెనింగ్‌ చేస్తాడు. ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో ఇషాన్‌ డకౌట్ అయ్యాడు. అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో అతను రాణించాలని టీమిండియా భావిస్తోంది. అఫ్ఘాన్‌తో మ్యాచ్‌ తర్వాత ఇండియా పాక్‌తో ఆడాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 14న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్టేడియంలో పాక్‌తో ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. ఒకవేళ ఈ నాలుగు రోజుల్లో గిల్‌ డెంగీ నుంచి కోలుకున్నా వెంటనే బరిలోకి దిగే ఛాన్స్ లేదు. పైగా ప్లేట్‌లెట్‌ కౌంట్ తక్కువగా ఉండడంతో అసలు గిల్‌ పాక్‌ తర్వాత మ్యాచ్‌కైనా అందుబాటులోకి వస్తాడా అంటే చెప్పడం కష్టమే. చికిత్స తర్వాత శుభమాన్ గిల్ చెన్నైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పీటీఐ(PTI) వార్తా సంస్థ తెలిపింది. గిల్‌ హోటల్‌కు తిరిగి వచ్చేశాడు. అక్కడ అతడిని బీసీసీఐ(BCCI) వైద్య బృందం పర్యవేక్షిస్తోంది.

ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో గిల్:
ఏడాది కాలంగా గిల్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా సొంత గడ్డపై చెలరేగిపోతున్నాడు. వన్డేల్లో ఏకంగా సచిన్‌ రికార్డులకే ఎసరు పెట్టేలా కనిపించాడు. 20 వన్డేల్లో 1,230 రన్స్‌ చేశాడు. యావరేజ్‌ కూడా 72.35గా ఉంది. గిల్‌ ఏకంగా ఈ ఏడాది ఐదు సెంచరీలు బాదాడు. వీటిలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో గిల్‌ ఈ డబుల్ సెంచరీ బాదాడు. నిజానికి ఒకే ఏడాదిలో వన్డేల్లో 1800కు పైగా రన్స్ చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. ఆ రికార్డును గిల్‌ బ్రేక్‌ చేస్తాడని అంతా భావిస్తున్నారు. ప్రస్తుత భారత అత్యుత్తమ బ్యాటర్‌లో ఒకడైన గిల్ జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు అసెట్‌గా మారుతాడని అంతా భావించారు. అయితే డెంగీ కారణంగా ఇది సాధ్యంకావడంలేదు. ముఖ్యంగా పాక్‌ మ్యాచ్‌లో ఇషాన్‌ ఎలా ఆడుతాడన్నదానిపై టెన్షన్ నెలకొంది. ఇషాన్‌ ఫామ్‌ అంతంతమాత్రమే. గిల్‌ నిలకడగా ఆడే బ్యాటర్‌. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న భారత్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ ఆడడంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇక నాలుగో ప్రపంచ కప్ మ్యాచ్ కు మాత్రం గిల్ కచ్చితంగా వస్తాడని తెలస్తోంది.

ALSO READ: వాళ్ళు మొదలు పెట్టారు.. మేము ముగిస్తాం..! ఆ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు