టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) మంచి ఊపుమీద ఉన్నాడు. అఫ్ఘాన్(Afghanistan)తో మ్యాచ్‌లో ప్రపంచ రికార్డులు తిరగరాశాడు. ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ రికార్డునే లేపేశాడు. నిజానికి వరల్డ్‌కప్(World cup)లో సచిన్(Sachin) రికార్డులు చాలా గొప్పవి. వరల్డ్‌కప్ అంటే సచిన్ పూనకాలు వచ్చినట్టు ఆడేవాడు. అయితే సచిన్ ఓ విషయంలో మాత్రం వెనకపడ్డాడు. 45 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో 15 హాఫ్ సెంచరీలు అయితే బాదాడు కానీ.. సెంచరీల విషయంలో మాత్రం కాస్త తక్కువ చేశాడు. వరల్డ్‌కప్‌లో సచిన్ సెంచరీల సంఖ్య ఆరు. ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్ కూడా. అయితే అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేయడంతో ఆ రికార్డు చెరిగిపోయింది. ఇప్పుడు రోహిత్ ఖాతాలో ఏడు వరల్డ్‌కప్ సెంచరీలు ఉన్నాయి. అది కూడా కేవలం 19 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు హిట్‌మ్యాన్. ఇది వరల్డ్ రికార్డు.
ఈరోజు రోహిత్ శర్మ రికార్డులు:
- ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు.
- అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు.
- ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ప్లేయర్.
- వన్డే మ్యాచ్‌లో భారత్ తరఫున పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు.
- ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా తరుఫున వేగవంతమైన సెంచరీ.
గేల్ రికార్డు ఢమాల్:
అటు వెస్టిండీస్ దిగ్గజం, సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ రికార్డు కూడా చెరిగిపోయింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ టాప్ పొజిషన్‌కి వచ్చేశాడు. 551 సిక్సర్లు కొట్టిన గేల్(Chris gayle) రికార్డు గల్లంతయ్యింది. ఇటు వరల్డ్‌కప్‌లో కూడా భారత్ తరుఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన హీరో రోహిత్ శర్మనే. ఇక అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు నెలకోల్పాడు హిట్‌మ్యాన్. టీమిండియా తరుఫున వేగంగా సెంచరీ చేసిన రికార్డు కూడా ఇప్పుడు రోహిత్‌దే. అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లో రోహిత్ 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు. గతంలో కపీల్ దేవ్ 72 బాల్స్‌లో వంద కొట్టాడు. ఇక ఈ సెంచరీతో వన్డేల్లో 31వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్. హిట్‌మ్యాన్ కంటే ఎక్కువగా సెంచరీలు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ, సచిన్ ఉన్నాడు. కోహ్లీ 47 సెంచరీలు చేయగా.. సచిన్ వన్డేల్లో 49 హండ్రెడ్స్ కొట్టాడు.
ALSO READ: పని మూడు గంటలు.. జీతం రూ.2లక్షలు.. క్రికెట్ తెలిస్తే చాలు..!