AFG vs NED: పాకిస్థాన్‌ కంటే పైపైకి అఫ్ఘానిస్థాన్‌.. సెమీస్‌కు వస్తున్నాం భయ్యా..!

వరల్డ్‌కప్‌లో అఫ్ఘానిస్థాన్‌ హ్యాట్రిక్‌ విక్టరీ కొట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన అఫ్ఘాన్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకొచ్చింది. అఫ్ఘాన్‌పై నెదర్లాండ్స్‌ ఏడు వికెట్లతో విజయం సాధించింది.

New Update
AFG vs NED: పాకిస్థాన్‌ కంటే పైపైకి అఫ్ఘానిస్థాన్‌.. సెమీస్‌కు వస్తున్నాం భయ్యా..!

వరల్డ్‌కప్‌లో అఫ్ఘానిస్థాన్‌ అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. చూస్తుంటే అఫ్ఘాన్‌ సెమీస్‌ చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ ఆటగాళ్లు దుమ్ములేపారు. నెదర్లాండ్స్‌ ఆట కట్టిస్తూ రెచ్చిపోయి బౌలింగ్‌ చేశారు. ఇటు బ్యాటింగ్‌లోనూ మెరవడంతో అఫ్ఘాన్‌ మరో మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌ విజయంతో అఫ్ఘానిస్థాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది. అటు పాకిస్థాన్‌ ఆరో స్థానానికి పడిపోయింది.


ఎవర్ గ్రీన్‌ ప్లేయర్‌..నబీ:
ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ బెర్రసి ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మ్యాక్స్‌ , అక్కర్‌మ్యాన్‌ అఫ్ఘాన్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీవైపు వెళ్తున్న మ్యాక్స్‌ 42 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అటు అక్కర్‌మ్యాన్‌ 29 రన్స్ వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఎంగెల్‌బ్రాచ్ట్‌ కాస్త స్లోగా బ్యాటింగ్ చేశాడు. మిగిలిన బ్యాటర్లు త్వరగా అవుట్ అయ్యారు. అఫ్ఘాన్ బ్యాటర్లలో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే అవుట్ అయ్యారు. మరో ఎండ్‌లో స్లోగా బ్యాటింగ్ చేసిన ఎంగెల్‌బ్రాచ్ట్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 86 బంతుల్లో 56 పరుగులు చేసిన ఎంగెల్‌బ్రాచ్ట్ రన్‌అవుట్ అయ్యాడు. నెదర్లాండ్స్‌ బ్యాటర్లలో ఏకంగా నలుగురు రన్‌ అవుట్ అయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో అఫ్ఘాన్ స్పిన్నర్‌ నబీ మూడు వికెట్లతో సత్తా చాటాడు. 9.3 ఓవర్లు వేసిన నబీ 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. 46.3 ఓవర్లలో నెదర్లాండ్స్‌ 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది.


180 రన్స్‌ లక్ష్యఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్‌ 31.3 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్‌ చేసింది. ఓపెనర్లు ఇద్దురూ త్వరగానే అవుటైనా రెహ్మాత్‌ షా, షాహీది అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 10.1 ఓవర్లలో అఫ్ఘానిస్థాన్‌ 55 రన్స్‌కు ఓపెనర్లిద్దరిని కోల్పోయింది. అదే సమయంలో రెహ్మత్‌, షాహిదీ క్రీజులో పాతుకుపోయారు. ఇద్దరు మరో వికెట్ పడకుండా.. వన్డే స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ స్కోర్‌ బోర్డును ముందుకు కదిలించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 54 బంతుల్లో 52 రన్స్ చేసిన రెహ్మత్‌ సాకిబ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అజ్మతుల్లా 28 బంతుల్లో 31 రన్స్ చేశాడు. షాహిదితో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Also Read: పాక్‌ క్రికెట్‌ను వెంటాడుతోన్న శని.. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు మరో షాక్‌..!

Watch:

Advertisment
తాజా కథనాలు