Under-19 WC: సచినే హీరో.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!

కెప్టెన్‌ ఉదయ్‌, సచిన్‌ సెంచరీలతో విజృంభించడంతో యువభారత నేపాల్‌పై భారీ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌ విజయంతో టీమండియా అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ మ్యాచ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలవడం విశేషం. ఆరు పాయింట్లతో పాటు నెట్‌రన్‌రేట్‌ +3.240గా ఉంది.

New Update
Under-19 WC: సచినే హీరో.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!

ICC Under 19 World Cup 2024: అండర్‌-19 వరల్డ్‌కప్‌లో టీమిండియా దుమ్ములేపుతోంది. గ్రూప్‌ స్టేజీలో ఓటమే ఎరుగని భారత్‌ కుర్రాళ్లు సగర్వంగా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నేపాల్‌పై మ్యాచ్‌లో గెలిచిన భారత్‌ మొత్తం ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలిచింది. 3 మ్యాచ్‌లు మూడు విజయాలు.. ఆరు పాయింట్లు.. +3.240 నెట్‌రన్‌రేట్‌తో గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచింది.


సచిన్ సెంచరీ:
మూడో గ్రూప్‌ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50ఓవర్లలో 5 వికెట్లకు 297రన్స్ చేసింది. ఓపెనర్లు ఆదర్ష్‌ సింగ్‌, అర్షిన్‌ కుల్‌కర్ణీ తొలి వికెట్‌కు కేవలం 26 మాత్రమే జోడించారు. వ్యక్తిగత స్కోరు 21 రన్స్ వద్ద ఆదర్ష్ సింగ్ గుల్సన్‌ ఝా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత టీమ్‌ స్కోరు 61 రన్స్ వద్ద రెండోవికెట్.. 62 రన్స్ వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది.

అదే సమయంలో ఉదయ్‌, సచిన్‌ దాస్‌ భారత్‌ను నిలబెట్టారు. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే ఇద్దరు హాఫ్‌ సెంచరీలు తర్వాత సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 101 బంతుల్లో 116 పరుగులు చేసిన సచిన్‌ దాస్‌ గుల్సన్‌ ఝా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.సచిన్‌-ఉదయ్‌ జోడి 4వ వికెట్‌కు 215 రన్స్ చేసింది. ఇక తర్వాత 107 బంతుల్లో 101 రన్స్ చేసిన ఉదయ్‌ కూడా గుల్సన్‌ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు.

ఛేజింగ్‌లో ఢమాల్:
298 పరుగలు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌ 50ఓవర్లలో కేవలం 165 రన్స్ మాత్రమే చేయగలిగింది. 9 వికెట్లను సమర్పించుకుంది. అతిజాగ్రత్త వారి కొంపముంచింది. టెస్టు తరహాలో నేపాల్ కుర్రాళ్లు బ్యాటింగ్‌ చేయడం భారత్‌ ఈజీగా గెలిచేసింది. భారీత్‌ బౌలర్లలో సౌమి పాండే నాలుగు వికెట్లు తీశాడు.

Also Read: విశాఖలో దారుణం..ఎమ్మార్వో హత్య..అదుపులో అనుమానితులు

WATCH:

Advertisment
తాజా కథనాలు