ICC New Rule: అంతర్జాతీయ క్రికెట్‌లో మంగళవారం నుంచి కొత్త రూల్ అమలవబోతోంది. ‘స్టాప్ క్లాక్’ పేరిట ఐసీసీ ప్రవేశపెట్టబోతున్న ఈ కొత్త రూల్ ప్రకారం బౌలింగ్ టీం నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ను వేయడానికి నిమిషం లోపు రెడీ అవ్వాలి. లేదంటే 5పరుగులు అదనంగా పెనాల్టీగా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఓవర్‌ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఐసీసీ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: షమీని ఓడించిన వరల్డ్ కప్ హీరో.. ఎవరంటే?
లాస్ట్ ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు తర్వాతి ఓవర్ బౌలింగ్ కోసం టీం సిద్ధంగా ఉండాలి. అలా లేకపోతే పెనాల్టీ రన్స్‌ను బ్యాటింగ్ టీమ్‌కు ఇస్తారు. మొదటి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చి, మూడోసారీ రిపీటైతే ఐదు పరుగులను పెనాల్టీగా విధిస్తారు. డిసెంబరు 12 నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య జరగబోతున్న ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ మొదలు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ ఈ రూల్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు.
ఇది కూడా చదవండి: కవర్లకు కూడా డబ్బులు లేవా…వైరల్ అవుతున్న సునీల్ గవాస్కర్ కామెంట్స్
ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో స్లో ఓవర్ రేట్ తగ్గిపోనుంది. ఇటీవల కెప్టెన్లకు ఇదే విషయంలో ఫైన్ పడుతూ వస్తోంది. ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు ఓవర్ల మధ్య ఎక్కువ టైం తీసుకుంటున్నారు కెప్టెన్లు. దీని వల్ల మ్యాచ్ ఆలస్యంగా ముగుస్తోంది. అయితే ఐదు పరుగులు పెనాల్టీ విధించడం రూల్ వల్ల కెప్టెన్లు ఇందుకు సాహసించకపోవచ్చు. దీంతో పాటు అటు పిచ్, అవుట్‌ఫీల్డ్ మానిటరింగ్ నిబంధనలకూ మార్పులు చేసినట్లు సమాచారం.