Shami: షమీని ఓడించిన వరల్డ్‌ కప్‌ హీరో.. ఎవరంటే?

దక్షిణాఫ్రికాపై సెమీ-ఫైనల్‌తో పాటు భారత్‌పై బ్లాక్‌బస్టర్ ఫైనల్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్‌కు నవంబర్‌లో ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ అవార్డు దక్కింది.

Shami: షమీని ఓడించిన వరల్డ్‌ కప్‌ హీరో.. ఎవరంటే?
New Update

ICC Men's Player Of Month - Travis Head: 2023 వరల్డ్‌కప్‌(World Cup) అనగానే అందరికి వెంటనే గుర్తొచ్చే పేర్లలో కచ్చితంగా మహ్మద్‌ షమీ(Mohammed Shami) ఉంటుంది. బ్యాటింగ్‌లో కోహ్లీ దుమ్ములేపితే ఇటు బౌలింగ్‌లో షమీ అదరహో అనిపించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన వీరుడిగా నిలిచాడు. టీమిండియా ఫైనల్‌కు రావడంతో షమీ పాత్ర మరవలేనిది. బ్యాటింగ్‌ పిచ్‌లపై ఓ రేంజ్‌లో వికెట్లు తీశాడు. అయితే గత నెల బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డు మాత్రం షమీకి దక్కలేదు. ఆస్ట్రేలియాకు వరల్డ్‌కప్‌ అందించడంతో కీ రోల్ ప్లే చేసిన ట్రావిస్‌ హెడ్‌(Travis Head)కి లభించింది.

publive-image హెడ్ ( PC: ICC)

హెడ్‌కే ఎందుకుంటే?

2023 వరల్డ్‌కప్‌ అక్టోబర్‌ 5న మొదలై నవంబర్‌ 9న ముగిసిన విషయం తెలిసిందే. గత నెల(నవంబర్‌)లో ఏ ఆటగాడు ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నిలిచాడో ఐసీసీ ప్రకటించింది. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ హీరో ట్రావిస్‌ హెడ్‌ ఈ లిస్ట్‌లో టాప్‌గా నిలిచాడు. ఫైనల్‌లో సెంచరీతో మెరిసిన హెడ్‌ ఆస్ట్రేలియాకు ఆరోసారి వరల్డ్‌కప్‌ అందించడంతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఫీల్డింగ్‌లోనూ హెడ్‌ భారత్‌ పతతానికి కారణం అయ్యాడు. దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్న రోహిత్‌శర్మ క్యాచ్‌ను కళ్లుచెదిరే రీతిలో అందుకున్నాడు.

వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో 120 బంతుల్లో 137 పరుగులతో అదరగొట్టాడు హెడ్‌. ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 240 పరుగుల స్వల్ప భారత స్కోరును ఛేదించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఒక దశలో 47/3తో కుప్పకూలింది. అయినప్పటికీ, హెడ్ కూల్‌గా ఆడాడు. 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో రాణించాడు. నవంబర్ 2021లో అవార్డును గెలుచుకున్న డేవిడ్ వార్నర్ తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండో ఆస్ట్రేలియా పురుషుల ఆటగాడు హెడ్ మాత్రమే.

Also Read: కవర్లకు కూడా డబ్బులు లేవా…వైరల్ అవుతున్న సునీల్ గవాస్కర్ కామెంట్స్

WATCH:

#cricket #mohammad-shami #travis-head
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe