/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohit-kohli-1-jpg.webp)
ICC RANKINGS: నాలుగేళ్లు నంబర్ వన్ అతడే.. 1,258 రోజులు వరుసగా నంబర్ వన్ స్థానంలో ఉన్న కోహ్లీ తర్వాత ఒక్కసారిగా కిందకు పడిపోయాడు. 2017-2021 మధ్య కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 పొజిషన్‌లో కొనసాగాడు. తర్వాత ఫామ్‌లేక తంటాలు పడ్డ కోహ్లీ గతేడాది అఫ్ఘాన్‌పై సెంచరీ తర్వాత పూర్వ ఫామ్‌ను అందుకున్నాడు. అప్పటినుంచి మొన్న వరల్డ్‌కప్ ముగిసే వరుకు కోహ్లీ వరుగుల సునామీ సృష్టించాడు. వరుసపెట్టి సెంచరీలు బాదాడు. అదే ఊపులో వరల్డ్‌కప్‌లోనూ మెరిశాడు. ఏకంగా 765 రన్స్‌తో టోర్ని టాప్ స్కోరర్‌గా నిలవడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ మరోసారి టాప్-4లోకి దూసుకొచ్చాడు.
Virat Kohli in ICC ODI rankings.
Before the start of World Cup - No. 9
At the end of World Cup - No. 3The GOAT peaked at the biggest stage🐐 pic.twitter.com/ot4dXnZtWb
— Pari (@BluntIndianGal) November 22, 2023
కోహ్లీ ఏ ర్యాంకులో ఉన్నాడంటే:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నంబర్-3 పొజిషన్‌కు వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 791 పాయింట్లు ఉన్నాయి. టాప్ ప్లేస్‌లో ఉన్న యువ ఓపెనర్ గిల్‌కు 826 పాయింట్లు ఉన్నాయి. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఉండగా.. ఒకవేళ కోహ్లీ ఆ సిరీస్‌లో రెచ్చిపోతే టాప్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే కోహ్లీతో పాటు రోహిత్‌కు కూడా ఈ వన్డే సిరీస్‌కు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
Highest % of Team runs in this World Cup 2023:
Virat Kohli - 25.2%
Ben Stokes - 23.4%
Daryl Mitchell - 22.7% pic.twitter.com/WoLmLSubMb
— CricketMAN2 (@ImTanujSingh) November 21, 2023
టాప్-5 ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్(వన్డే)
1. శుభమాన్ గిల్ - 826 రేటింగ్ పాయింట్లు
2. బాబర్ ఆజం - 824 రేటింగ్ పాయింట్లు
3. విరాట్ కోహ్లీ - 791 రేటింగ్ పాయింట్లు
4. రోహిత్ శర్మ - 769 రేటింగ్ పాయింట్లు
5. క్వింటన్ డి కాక్ - 760 రేటింగ్ పాయింట్లు
Virat Kohli batted for 19 hours and 56 minutes in the 2023 World Cup.
- The most by a batter in the history of a World Cup edition...!!! 🐐 pic.twitter.com/VdWewItLzm
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023
లిస్ట్ పరిశీలిస్తే టాప్-5 బ్యాటర్లలో ముగ్గురు భారతీయులే ఉండడం విశేషం. 769 పాయింట్లతో రోహిత్ నాలుగో స్థానంలో నిలిచాడు.
Also Read: ఓడిపోవడానికి అదే కారణం.. వారిలో ధైర్యం లేదు.. గంభీర్ ఘాటు విమర్శలు!
WATCH: