ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కి ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. రెండు మ్యాచ్ ల నిషేధాన్ని విధించడంతో పాటు ఫీజులో 75 శాతం కోత కూడా విధించింది. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన చివరి వన్డేలో హర్మన్ ప్రవర్తన దురుసుగా అనిపించింది. అంతేకాకుండా కౌర్ తన బ్యాట్ తో స్టంప్ ను కొట్టి ఫీల్డ్ అంపైర్ ను కూడా తిట్టింది.
హర్మన్ తన దురుసు ప్రవర్తన వల్ల నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆమె ఫీజులో సుమారు 75 శాతం కోత విధించింది కూడా. అంతేకాకుండా మూడు డీ మెరిట్ పాయింట్లను కూడా కేటాయించారు. ఆమె పై సస్పెన్షన్ విధించడంతో సెప్టెంబర్ లో జరిగే ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్ లో జరిగే తొలి రెండు మ్యాచ్ లకు కూడా హర్మన్ దూరం కానుంది.
ఇది అంతా కూడా కేవలం హర్మన్ కోపం వల్లే జరిగింది. బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో అంపైర్ ఆమెకు ఔట్ ఇవ్వడం వివాదాస్పదమైంది. దాంతో ఆ ఔట్ గురించి హర్మన్ అంపైర్ తో గొడవకు దిగింది. అంతేకాకుండా అంపైర్ పై తీవ్ర విమర్శలు చేసింది.
ఇక నుంచి ఇలాంటి అంపైరింగ్ ను ఎదుర్కొవడానికి సిద్ధమై వస్తానంటూ వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా ఆమె చేతలు కూడా చాలా తీవ్రంగా ఉండటంతో ఐసీసీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.