ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఏ ఫార్మాట్లో ఆడిస్తారో తెలుసా? By srinivas 13 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ICC Champions Trophy: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొనబోయే జట్ల లిస్ట్‌పై క్లారిటీ వచ్చేసింది. మరో వారంలో భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ముగియగానే ఐసీసీ దీనిపై కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2023 వరల్డ్ కప్‌లో పాయింట్ల పట్టికలో టాప్-8 జట్లు ఇందులో పాల్గొనబోతుండగా 2025 పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది. అయితే ఈసారి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్లో ఆడిస్తారా? లేక టీ20కి మారుస్తారా? అన్నదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాగా దీనిపై ఐసీసీ.. క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు బోర్డ్ సభ్యుడు ఒకరు మీడియాకు తెలిపనట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇదిలావుంటే.. వన్డే ప్రపంచకప్‌కు భారత్‌లో వస్తున్న ఆదరణ చూసి ఛాంపియన్స్ ట్రోఫీని ఇదే ఫార్మాట్లో కొనసాగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయట. బ్రాడ్కాస్టర్లు మాత్రం దీనిని పొట్టి ఫార్మాట్‌కు మార్చాలని ఐసీసీపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఈవెంట్‌కు అతిథ్యమివ్వనున్న పాకిస్థాన్‌తో పాటు ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలే స్టేజ్‌లో ఉన్న ఇంగ్లండ్ ఆందోళన చెందింది. కానీ, గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఎట్టకేలకు అర్హత సాధించింది. శ్రీలంక, నెదర్లాండ్స్‌లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయాయి. 1. ఇండియా 2. పాకిస్తాన్ 3. ఆస్ట్రేలియా 4. న్యూజిలాండ్ 5. సౌతాఫ్రికా 6. అఫ్గానిస్తాన్ 7. ఇంగ్లండ్ 8. బంగ్లాదేశ్.. జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్నాయి. Also read :కుక్కను పెంచుకుంటే కష్టాలు తొలగిపోతాయా.. డాగ్ డెలివరీ పార్టీ ఇచ్చిన రాజ్‌కాళీ చెబుతుంది నిజమేనా? ఇక 2023 వరల్డ్ కప్ సెమీస్ బెర్త్‌లు ఖరారు కావడంతో ఇక ఫైనల్‌కు ఎవరు వెళ్తారు, టైటిల్ ఎవరు గెలుస్తారనే విషయంలో చర్చ జరుగుతోంది. మెజార్టీ క్రీడా విశ్లేషకులు ఇండియాకే టైటిల్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఆడినట్టే ఆడితే టీమ్ ఇండియాకు ఫైనల్ అవకాశాలు కచ్చితంగా ఉంటాయని దక్షిణాఫ్రికా లెజెండ్ హషీం ఆమ్లా అంచనా వేశాడు. ఇక నవంబర్ 15న వాంఖడే స్టేడియంలో జరగబోయే సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. #pakistan #champions-trophy-2025 #icc #qualified-teams మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి