Benjamin Netanyahu : 35000 మంది హత్య.. ప్రపంచం పట్టించుకోని నియంత కథ!

2023 అక్టోబర్‌ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 35,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆలోచనా తీరు కారణంగానే ఈ యుద్ధం ఆగడంలేదన్న అభిప్రాయాలను అమెరికా వ్యతిరేక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి!

New Update
Benjamin Netanyahu : 35000 మంది హత్య.. ప్రపంచం పట్టించుకోని నియంత కథ!

Murder : యుద్ధోన్మాదం, జాత్యహంకారం, దురాక్రమణ, దిగ్బంధం.. ఏ యుద్ధం వెనుక కథ చూసినే కనిపించే కారణాలు ఇవే..! రష్యా-యుక్రెయిన్‌ (Russia-Ukraine) యుద్ధమైనా.. ఇజ్రాయెల్‌-హమస్‌ (Israel-Hamas) పోరైనా దాని వెనుక ఉన్న మూలాలు ఇవే..! ఇజ్రాయెల్‌-హమస్‌ యుద్ధంలో ఇరు వర్గాలకు చెందిన మిలిటెంట్లు, ఆర్మీ అధికారుల కంటే చనిపోయిన సామాన్యుల సంఖ్యే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి. 2023 అక్టోబర్‌ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 35,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఆలోచనా తీరు కారణంగానే ఈ యుద్ధం ఆగడంలేదన్న అభిప్రాయాలను అమెరికా వ్యతిరేక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి!

2024 మే 21న వెస్ట్ బ్యాంక్‌ (West Bank) లో జెనిన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో ఏడుగురు పాలస్తీనియన్లు మరణించారు. నగరంలో సాయుధ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీనిపై వార్‌ క్రైమ్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏడు నెలల యుద్ధంలో తీసుకున్న చర్యలపై బెంజమిన్ నెతన్యాహుతో హమాస్ నాయకుల అరెస్ట్ వారెంట్లను కోరింది. అయితే ఇజ్రాయెల్‌కు నిత్యం అండదండలందించే అమెరికా ఈ వారెంట్లను తప్పుబడుతోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికారులపై ఆంక్షలు విధించడానికి బైడెన్‌ సర్కార్‌ రెడీ అయ్యిందని తెలుస్తోంది.

యుద్ధంలో సామాన్యులు బలికావడం బాధకారమంటున్నారు మానవ హక్కుల నేతలు. మరోవైపు అమెరికా అనుకూలిత వెస్ట్రన్‌ మీడియా, యాంటీ అమెరికా దేశాల మీడియా అసలు నిజాలను బయటపెట్టడం లేదన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో హమస్‌ తీవ్రవాదుల కంటే సామాన్య పాలస్తీనియన్లు.. ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్లు కూడా చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఎంత క్రూరమైన హింసకు పాల్పడుతున్నా, అమాయకులు చనిపోతున్నా అమెరికా వర్గాలు మాత్రం నెతన్యాహుని మంచివాడిగానే చిత్రికరీంచే ప్రయత్నం చేస్తున్నాయన్నని అంటున్నాయి.

నిజానికి పాలస్తీనియన్లకు యుద్ధం కొత్తకాదు. 75 ఏళ్లలో అత్యధిక యుద్ధాలను చూసిన నేల ఇదే. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం లేకుండానే అమెరికా అండతో ఏకపక్షంగా పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ దేశాన్ని ప్రకటించుకుందన్న విమర్శలు ఉన్నాయి. అప్పటినుంచి పాలస్తీనాలో రక్తం చిమ్మని సమయం లేదంటారు విశ్లేషకులు. ఈ నెత్తుటి చరిత్రకు ఇజ్రాయెల్‌ దురాక్రమణ మోజే కారణమని చెబుతుంటారు.

Also Read : ఈసీ సంచలన నిర్ణయం.. బాణసంచా విక్రయాలపై నిషేధం

Advertisment
Advertisment
తాజా కథనాలు