Cricket:ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ..టాప్ 10లో భారత్ ఆటగాళ్ళు

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టీమ్ ఇండియా ఆటగాళ్ళల్లో రోహిత్ శర్మ సత్తా చాటాడు. ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు హిట్ మ్యాన్. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో రోహిత్ రెండు మ్యాచ్ లలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Cricket:ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ..టాప్ 10లో భారత్ ఆటగాళ్ళు
New Update

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ వన్డే ర్యాంకుల్లో దూసుకుపోయాడు.వన్డే వరల్డ్ కప్ తో తొలి మూడు మ్యాచ్ ల్లో సత్తా చాటిన రోహిత్ మరోసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 5 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్ లో నిలిచాడు. గతవారం టాప్ 10 నుంచి పడిపోయిన హిట్ మ్యాన్ మళ్లీ పుంజుకుని తన ర్యాంక్ ను మెరుగుపరుచుకున్నాడు. అఫ్గానిస్థాన్ తో జరిగి మ్యాచ్ లో సెంచరీ(131)తో పాటు పాకిస్థాన్ తో జరిగి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ (86)తో అదరగొట్టాడు.

Also Read:పాపం పాకిస్తాన్…ఫ్యూయల్ లేక ఆగిన 48 ఫ్లైట్‌లు

ఇక మొదటి స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కంటిన్యూ అవుతున్నాడు. టీమిండియా సూపర్ స్టార్ శుభ్‌మ‌న్ గిల్ రెండో ర్యాంక్ ను పదిలంగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ మూడు స్థానాలు మూడవ ర్యాంకులోకి వచ్చేశాడు. విరాట్ కోహ్లి 8, కేఎల్ రాహుల్ 19 ర్యాంకుల్లో ఉన్నారు. అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 49 స్థానాలు జంప్ చేసి 18వ ర్యాంక్ దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 16 స్థానాలు ఎగసి 27వ ర్యాంక్ లోకి ఎంటర్ అయ్యాడు.

బౌలింగ్...

బౌలింగ్ ర్యాంకులలో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ టాప్ లో ఉన్నాడు. టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ 3వ ర్యాంక్ కు పడిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 8వ ర్యాంక్ లో కంటిన్యూ అవుతున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.. నాలుగైదు ర్యాంకుల్లో ఉన్నారు.

#cricket #icc #bowlers #batsmen #rankings
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe