Jobs: ముగుస్తున్న గడువు..4,500కు పైగా బ్యాంక్‌ జాబ్స్‌.. త్వరపడండి!

ఐబీపీఎస్‌ బ్యాంక్‌ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకి అలెర్ట్. ప్రొబేషనరీ ఆఫీసర్(PO), స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే (ఆగస్టు 20) చివరి తేదీ. ఈ పోస్ట్‌లకు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు రేపటిలోపు IBPS అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ఫారమ్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. రేపటి తర్వాత అప్లికేషన్ విండో క్లోజ్‌ అవుతుంది.

New Update
Jobs: ముగుస్తున్న గడువు..4,500కు పైగా బ్యాంక్‌ జాబ్స్‌.. త్వరపడండి!

IBPS SO, PO JOBS: బ్యాంక్‌ PO, SO జాబ్స్‌కి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ లేదా IBPS రిక్రూట్‌మెంట్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ibps.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . IBPS నోటిఫికేషన్ ప్రకారం, IBPS PO 2023 ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ IBPS రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1402 SO ఖాళీలను భర్తీ చేస్తుండగా.. IBPS POకి సంబంధించి పోస్టుల ఖాళీల సంఖ్య 3,049గా ఉంది. IBPS SO 2023 ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 30, డిసెంబర్ 31 తేదీలలో జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష జనవరి 28, 2024న ఉంటుంది.

ప్రొబేషనరీ ఆఫీసర్ జీతం నెలకు రూ. 52,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. ఒక స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రతినెలా రూ.38,000 నుంచి రూ.39,000 వరకు సంపాదించుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి:

స్టెప్ 1: IBPS అధికారిక వెబ్‌సైట్‌ ibps.in ని విజిట్ చేయండి.

స్టెప్ 2: 'IBPS PO 2023' , 'IBPS SO 2023' అప్లికేషన్ లింక్‌లపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: మీ వివరాలను నమోదు చేయండి తర్వాత లాగిన్ చేయండి.

స్టెప్ 4: దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయండి.

స్టెప్ 5: అవసరమైన పత్రాలను సమర్పించండి, దరఖాస్తు రుసుమును చెల్లించండి.

స్టెప్ 6: ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి.

IBPS PO, SO 2023 దరఖాస్తు రుసుము SC, ST, PwBD అభ్యర్థులకు రూ.175. మిగతా వారందరికీ, రుసుము రూ.850.

• ఖాళీ వివరాలు:

• అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-I): 500

• HR/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-I): 31

• ఐటీ అధికారి(స్కేల్-I): 120

• లా ఆఫీసర్ (స్కేల్-I): 10

• మార్కెటింగ్ అధికారి (స్కేల్-I): 700

• మార్కెటింగ్ అధికారి (స్కేల్-I): 41

Advertisment
తాజా కథనాలు