Smitha Sabharwal IAS: పూజా ఖేద్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారిణి నకిలీ వైకల్యం సర్టిఫికెట్ తో సివిల్స్ సర్వీస్ ఉద్యోగంలో ప్రవేశించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాలంటూనే ఆల్ ఇండియా సర్వీసులలో వారికి కోటా ఎందుకని ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఎక్స్ వేదికగా ఆమె చేసిన వరుస ట్వీట్లు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన ఉద్యోగాల్లో కోటా ఎందుకని డెస్క్ లో పని చేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని సూచించారు.
పూర్తిగా చదవండి..Smitha Sabharwal IAS: ఆ రిజర్వేషన్లపై దుమారం రేపిన స్మితా సబర్వాల్ కామెంట్స్.. నెట్టింట బిగ్ డిబేట్!
ఆల్ ఇండియా సర్వీసు ఉద్యోగాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్లు అవసరం లేదంటూ తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ పెట్టిన పోస్ట్ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Translate this News: