Amrapali IAS : మళ్లీ తెలంగాణలోకి ఆమ్రపాలి ఐఏఎస్.. కీలక పోస్టు దక్కే ఛాన్స్?

ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి..రాష్ట్ర సర్వీస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సోమవారం సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సెంట్రల్‌ సర్వీస్‌లో డిప్యుటేషన్‌ పూర్తవడంతో ఇప్పుడు రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు ఆమ్రపాలి. ఆమెకు కీలక పోస్టు దక్కే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది.

New Update
Amrapali IAS : మళ్లీ తెలంగాణలోకి ఆమ్రపాలి ఐఏఎస్.. కీలక పోస్టు దక్కే ఛాన్స్?

ఆమ్రపాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ ఒంగోలులోని ఎన్‌. అగ్రహారం. కాటా వెంకట్‌రెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. విశాఖలో ఉన్నత చదువులు చదివారామె. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో 2010ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి..రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో కలెక్టర్‌గా పనిచేశారు. ఆమ్రపాలి తన పనితీరుతో సంచలనాల కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లలో ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.

రాష్ట్ర విభజన తర్వాత వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి.. తన పనితీరుతో డైనమిక్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు. తెలంగాణ ప్రభుత్వంలో ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా..అంతకుముందు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గానూ పనిచేశారు. తనదైన ముద్రను వేసి మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020లో ఆమెకు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అక్కడ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. అతి చిన్న వయసులోనే పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులైన వారిలో ఒకరుగా నిలిచిన ఆమ్రపాలి..2018, ఫిబ్రవరిలో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు కేంద్ర సర్వీస్‌లో డిప్యుటేషన్‌ పూర్తవడంతో తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చారు. ఆ మేరకు ఇక్కడ రిపోర్ట్‌ చేసి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉన్నతాధికారులంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇన్నాళ్లూ దూరంగా ఉన్న OSD ప్రియా వర్గీస్‌, మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ సీఎస్‌ అర్వింద్‌ కుమార్‌ కూడా రేవంత్‌ను కలిశారు. ఐతే స్మితా సబర్వాల్‌ మాత్రం ముఖ్యమంత్రిని కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: వాట్సాప్ వాడే వారికి బిగ్ షాక్.. న్యూ ఇయర్ నుంచి కొత్త రూల్!

#revanth-reddy #amrapali-ias #ts
Advertisment
Advertisment
తాజా కథనాలు